Nandini Rai : ‘సౌందర్య’ మా స్కూల్ కి వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకుంది.. నేను సంపాదిస్తుంటే మా అమ్మ డబ్బులు లెక్కపెట్టుకునేది..

తను సినీ పరిశ్రమకు ఎలా వచ్చింది, హీరోయిన్ అవ్వాలని ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది అని తెలిపింది నందిని రాయ్.

Nandini Rai : ‘సౌందర్య’ మా స్కూల్ కి వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకుంది.. నేను సంపాదిస్తుంటే మా అమ్మ డబ్బులు లెక్కపెట్టుకునేది..

Nandini Rai Tells about Soundarya and How she come in to Movies

Updated On : May 28, 2025 / 8:25 PM IST

Nandini Rai : మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి మిస్ ఆంధ్రప్రదేశ్ అయి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది తెలుగమ్మాయి నందిని రాయ్. బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకొని సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తను సినీ పరిశ్రమకు ఎలా వచ్చింది, హీరోయిన్ అవ్వాలని ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది అని తెలిపింది నందిని రాయ్.

నందిని రాయి మాట్లాడుతూ.. నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు మా స్కూల్ కి సౌందర్య గారు వచ్చారు. ఒక యాడ్ షూట్ కోసం వచ్చారు. అది ఒక గ్యాస్ సిలిండర్ యాడ్ షూట్. ఆ యాడ్ లో సౌందర్య కూతురి పాత్రలో నటించడానికి ఆవిడే వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకుంది. నేను చబ్బీగా, క్యూట్ గా ఉండేదాన్ని. అలా సౌందర్యతో నేను ఒక యాడ్ చేశాను. ఆమె మా స్కూల్ కి వచ్చినప్పుడు అందరూ ఆటోగ్రాఫ్స్ కోసం ఎగబడటం, ఆమెకు చీరలు, స్వీట్స్, గిఫ్ట్స్ ఇవ్వడం, అందరూ ఆమెకు అటెన్షన్ ఇవ్వడం చూసి హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యాను.

Also Read : Triptii Dimri : ‘స్పిరిట్’లో ప్రభాస్ పోలీస్.. మరి త్రిప్తి దిమ్రి పాత్ర ఏంటో తెలుసా? త్రిప్తి రెమ్యునరేషన్ ఎంతంటే?

కానీ మా నాన్న ఒప్పుకోలేదు. MBA చేసేదాకా నాన్న సినిమాల్లోకి రానివ్వలేదు. ఒకసారి మా అమ్మ మిస్ హైదరాబాద్ కి నా పేరుతో అప్లై చేసింది. రిప్లై రావడంతో వెళ్లి పార్టిసిపేట్ చేశాను. అపుడు మిస్ హైదరాబాద్ గెలిచాను. ఆ తర్వాత 2010 లో మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ గెలిచాను. తర్వాత మిస్ ఇండియాకి వెళ్ళాలి కానీ హైట్ తక్కువ ఉందని సెలెక్ట్ అవ్వలేదు. మిస్ ఆంధ్ర, హైదరాబాద్ గెలవడంతో బాగా బిజీ అయ్యాను. హైదరాబాద్ సిటీలో బిజీ మోడల్ అయ్యాను. ఓ పక్క చదువుకుంటూనే మోడలింగ్, యాడ్స్ చేసేదాన్ని. అప్పట్లో ఫుల్ యాడ్స్, మోడలింగ్, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉండేదాన్ని. నేను ఎంత బిజీ అంటే అప్పుడు నేను సంపాదిస్తుంటే మా అమ్మ కూర్చొని డబ్బులు లెక్కపెట్టుకొనేది. మోడల్ గానే ఫుల్ స్టార్ డమ్ చూసేసాను. ఆ తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాను అని తెలిపింది.

Also Read : Seetha Payanam : యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు హీరోయిన్ గా.. ‘సీతా పయనం’ టీజర్ రిలీజ్..