Panjaa Re-Release: పవర్ స్టార్ స్టైలిష్ సినిమా.. ‘పంజా’ రీ రిలీజ్.. ఎప్పుడంటే..?

పవన్ కళ్యాణ్ చాలా సినిమాలు రీ రిలీజ్ అవ్వగా ఇప్పుడు పంజా సినిమా రీ రిలీజ్ కాబోతుంది. (Panjaa Re-Release)

  • Updated on- July 6, 2026 / 11:18 AM IST

Pawan Kalyan Panjaa Re-Release Date

Panjaa Re-Release : ఇటీవల పాత హిట్ సినిమాలు, ఫ్లాప్స్ లో క్లాసిక్ సినిమాలు కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ తో పాటు, మ్యూజిక్ లవర్స్ కూడా ఈ రీ రిలీజ్ లకు వెళ్లి సందడి చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలా సినిమాలు రీ రిలీజ్ అవ్వగా ఇప్పుడు పంజా సినిమా రీ రిలీజ్ కాబోతుంది.

పవన్ కళ్యాణ్ కెరీర్లో OG కంటే ముందు మోస్ట్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ సినిమాగా తెరకెక్కింది పంజా. తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2011 లో రిలీజయి యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచినా ఇప్పటికి పవన్ కెరీర్ లో మోస్ట్ స్టైలిష్ సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాలో పాటలు కూడా రిపీట్ మోడ్ లో వినొచ్చు.

Also See : ఫ్యామిలీతో పీవీ సింధు బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు.. భర్తను మిస్ అవుతున్నాను అంటూ పోస్ట్..

ఇప్పుడు పంజా సినిమా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న రీ రిలీజ్ చేస్తున్నారు ప్రకటించారు. దీంతో పవన్ ని మరోసారి స్టైలిష్ అవతారంలో థియటర్లో చూడటానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. పవన్ బర్త్ డేకి ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ప్లాన్ చేశారు.