Bigg Boss Today Promo : ఈ వారం నామినేషన్స్ ఫైర్ మొదలు.. టార్గెట్ అపూర్వ.. బిగ్ బాస్ ప్రోమో రిలీజ్..
మీరు కూడా లేటెస్ట్ బిగ్ బాస్ ప్రోమో చూసేయండి..(Bigg Boss Today Promo)
Bigg Boss Today Promo
Bigg Boss Today Promo : నిన్న ఆదివారం ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ అయిపొయింది. ఇక నేడు సోమవారం నామినేషన్స్ ప్రక్రియ జరగనున్నట్టు చూపించారు. తాజాగా ఇవాళ్టి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. నామినేషన్స్ చేయడానికి కూడా ఓ టాస్కు ఇచ్చాడు బిగ్ బాస్. ఓ గుమ్మడికాయని దాచిపెట్టి ఇద్దరిద్దర్ని పిలుస్తారు. ఎవరికి దొరికితే వాళ్ళు నామినేషన్స్ చేయొచ్చు. నామినేషన్స్ చేసినవాళ్లు ఎవర్ని చేసారో వాళ్ళ ముందు ఉన్న దిష్టిబొమ్మల కుండలను పగలకొట్టాలి.
రామ్ ప్రసాద్.. అమన్ ని నామినేట్ చేసాడు. త్రిగుణ ని ఆటలో గాయపరిచినందుకు అని అప్పటి సంఘటనలు చెప్పి ఫైర్ అయ్యాడు. దాంతో అమన్ రివర్స్ సమాధానాలు ఇచ్చాడు. త్రిగున్ గురించి కావడంతో త్రిగున్ ఎంటర్ అవ్వడంతో అపూర్వ, రోహిత్. వంశీ, నరేష్ అందరూ ఈ గొడవలోకి ఎంట్రీ అయ్యారు.
ముకేశ్.. అపూర్వ ని నామినేట్ చేసాడు. అపూర్వ గత వారం కెప్టెన్ గా ఓవర్ యాక్షన్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె పొగరు చూపించినందుకు, ఆమె చేసిన సంఘటనలు గుర్తుచేసి నామినేట్ చేసాడు. ఈ గొడవలో వర్షిణిని అపూర్వ తిట్టడంతో వర్షిణి వచ్చి నాగార్జున నిన్ను డిజాస్టర్ కెప్టెన్ అని తిట్టింది గుర్తు చేసి గొడవ పడింది. త్రిగున్ కూడా అపూర్వ ని నామినేట్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా గొడవ పడ్డారు. దీంతో నేడు నామినేషన్స్ ఫుల్ ఫైర్ మీద సాగబోతున్నట్టు తెలుస్తుంది.
మీరు కూడా లేటెస్ట్ బిగ్ బాస్ ప్రోమో చూసేయండి..
