Supritha Surekhavani : తల్లీకూతుళ్లపై విమర్శలు.. అందుకే మాపై నెగిటివిటీ అంటూ స్పందించిన సుప్రీత..
తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ ఇంటర్వ్యూలో తన తల్లితో ఉన్న అనుబంధాన్ని, తనపై, సురేఖవాణిపై వచ్చిన విమర్శలపై స్పందించింది. (Supritha Surekhavani)
Supritha Surekhavani
Supritha Surekhavani : సురేఖవాణి కూతురుగా అందరికి పరిచయం అయిన సుప్రీత ప్రస్తుతం సోషల్ మీడియా, టీవీ షోలతో దూసుకుపోతుంది. హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ ఇంటర్వ్యూలో తన తల్లితో ఉన్న అనుబంధాన్ని, తనపై, సురేఖవాణిపై వచ్చిన విమర్శలపై స్పందించింది.
సుప్రీత మాట్లాడుతూ.. కొంతమంది నన్ను కంట్రోల్ చేయదా అని మా అమ్మని తిడతారు. నాకు కూడా మీ అమ్మకు చెప్పవా అని తిడతారు. నేను ఏం వేసుకోవాలో అమ్మ డిసైడ్ చేయదు. అమ్మ వేసుకునేది నేను డిసైడ్ చేయను. అందరూ పేరెంట్స్ కి తెలియకుండా అన్ని చేస్తారు. ఫ్రీడమ్ లేక ఇష్టమొచ్చినట్టు చేసి ఇబ్బందుల పాలవుతారు. అలాంటి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళల్లోనే ఉన్నారు. కానీ నాకు మా అమ్మ ఫ్రీడమ్ ఇచ్చి అన్ని చెప్పింది. నేను టీనేజ్ లోకి వచ్చినప్పుడు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పింది. లవ్ గురించి చెప్పి అది అట్రాక్షన్ అనే ఫీలింగ్, లవ్ కాదు అని చెప్పింది. నువ్వేం తప్పు చేసినా ఫస్ట్ నాకు చెప్పు అని చెప్పింది. కొన్ని విషయాల్లో నన్ను కొట్టింది కూడా అమ్మ. అందుకే మేము అంత క్లోజ్ గా ఉంటాము. తల్లి తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు, నేను నా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు అది వాళ్లకు ప్రాబ్లమ్ కాదు. కానీ మేము ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తేనే వాళ్లకు ప్రాబ్లమ్. అందుకే మా పై నెగెటివిటి. దానిపై మేము చాలా ఫైట్ చేసాము. మొదట్లో మేము ఏడ్చాము. తర్వాత పట్టించుకోవడం మానేసాం. అలా కామెంట్స్ చేసేవాళ్లను ఏమి చేయలేము.
డ్రగ్స్ ఇష్యూ సమయంలో కూడా తల్లి కూతుళ్లు ఇలా చేస్తారు, అలా చేస్తారు అని బాగా తిట్టారు. మేము పార్టీకి వెళ్లి వైన్ తాగుతాం అంతే. మా అమ్మకు 18 ఏళ్లకు పెళ్లి అయింది. 20 ఏళ్లకు నేను పుట్టాను. మా అమ్మ ఇంక లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేసింది. నేను పుట్టిన తర్వాత కూడా పని చేస్తూనే ఉంది. నా చిన్నప్పుడు కూడా అమ్మ నాన్న బిజీగానే ఉన్నారు. నేను అది గుర్తించి అమ్మని ఎంజాయ్ చేయమన్నాను. నేను ప్రపంచాన్ని చూస్తున్నాను. మా అమ్మ కి కూడా చూపిస్తున్నాను అని తెలిపింది.
