Rakul Preet Singh : ఐటీ దాడులపై స్పందించిన రకుల్.. నాకు బినామీ ఆస్తులు లేవు అంటూ..
రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల జరిగిన ఆదాయపు పన్ను శాఖ సోదాలకు సంబంధించి తనపై వస్తున్న వార్తలను ఖండించారు. (Rakul Preet Singh)
Rakul Preet Singh
Rakul Preet Singh : ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త, ఆమె మామయ్య ఇల్లు, ఆఫీస్ లలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. విదేశీ నిధులు బదిలీలలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల జరిగిన ఆదాయపు పన్ను శాఖ సోదాలకు సంబంధించి తనపై వస్తున్న వార్తలను ఖండించారు.
Also Read : Tamil Politics : తమిళ రాజకీయాల్లోకి హీరో శివకార్తికేయన్..! హాట్ టాపిక్‌గా ఫ్యాన్స్ మీట్ ..
రకుల్ ప్రీత్ సింగ్ తన సోషల్ మీడియాలో.. వాస్తవాలను నిర్ధారించుకోకుండా వార్తలను సంచలనంగా ప్రచారం చేసే ధోరణి పెరుగుతోంది. ఈ విషయం గురించి ఒకసారి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. ఆదాయపు పన్ను శాఖ చేసిన సోదాలు నాకు సంబంధించినవి కావు. నేను ఆర్మీ కుటుంబం నుంచి వచ్చాను. సినీ పరిశ్రమలో నాకు ఎలాంటి గాడ్‌ఫాదర్ లేరు. నా కష్టంతోనే ఈ స్థాయికి వచ్చాను. 20 ఏళ్ల వయసు నుంచే బాధ్యత కలిగిన పౌరురాలిగా నా పన్నులను సక్రమంగా చెల్లిస్తున్నాను.
నా వ్యక్తిగత హోదాలో గానీ, ఏదైనా నిర్మాణ సంస్థ తరఫున గానీ ఎలాంటి అక్రమ విదేశీ నగదు బదిలీలతో నాకు సంబంధం లేదు. దేశంలో, విదేశాల్లో ఎవరి పేరుతోనూ బినామీ ఆస్తులు నాకు లేవు. అలాగే ఎవరూ నాకు ఎప్పుడూ విలువైన ఆస్తులను బహుమతిగా ఇవ్వలేదు. అలాంటి ఖరీదైన బహుమతులను స్వీకరించకూడదనేది నా సూత్రం. నా గురించి తప్పుడు, హానికరమైన, ఊహాజనిత వార్తలు ప్రచురించిన వారు వాటిని వెనక్కి తీసుకుని వాస్తవాలను స్పష్టం చేయాలని కోరుతున్నాను. మీడియా సంస్థలకు వాణిజ్యపరమైన ఒత్తిళ్లు ఉంటాయని నేను అర్థం చేసుకోగలను. అయితే ఆ ఒత్తిళ్లు వాస్తవాలపై ప్రభావం చూపకూడదు. ముఖ్యంగా ఒక వ్యక్తి ప్రతిష్ఠ, వృత్తి జీవితానికి నష్టం కలిగించేలా ఉండకూడదు అని తెలిపింది.

