AI Effect : సినీ పరిశ్రమకే కాదు అందరికి ప్రమాదకరమే.. AI డీప్ ఫేక్ .. ఇలా అయితే కష్టమే..
ఫేమస్ పర్సనాలిటీలకే కాదు ఎవరికైనా ఇది ప్రమాదకరమే. (AI Effect)
AI Effect
AI Effect : ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోని ఓ పాటని కొందరు మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టారు. ఇది అవతలి వారిని ఎంత బాధిస్తుందనేది వారికి పట్టదు. కానీ దానికి టార్గెట్ అయినవాళ్లు, బాధితులు మాత్రం నిస్సహాయంగా చూస్తుండిపోవాల్సిందేనా అనే ప్రశ్న వస్తోంది. దీనిపై హీరోలు ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మెగాస్టార్, రామ్ పోతినేని.. ఇలా చాలా మంది స్పందించారు. ఇది చాలా డీప్‌గా హర్ట్ చేస్తుందని, ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈ వీడియోలను తయారు చేసిన వాళ్ళవి, షేర్ చేసిన వారి అక్కౌంట్లను జల్లెడ పడుతున్నారు
టెక్నాలజీ ఉపయోగించి ఒక మహిళను అత్యంత హేయంగా చిత్రీకరించడం తీవ్రంగా కలచివేస్తోందని అంతా అంటున్నారు. ఏఐతో మార్ఫింగ్ చేసిన ఇలాంటి వీడియోలను సృష్టించడం, వాటిని షేర్ చేయడం అమానుషమని చిరంజీవి ట్వీట్ చేశారు. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారాయన. ఈ ఉదంతం.. ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క సినిమాకో పరిమితమైన సమస్య కాదని, దీన్ని తేలిగ్గా తీసుకోకూడదని పేర్కొన్నారు. మెగాస్టార్ చెప్పినట్లే ఇదే మొదలు కాకపోవచ్చు, ఆఖరూ కాకపోవచ్చు. కానీ చేతిలో టూల్ ఉంది కదా అని ఎవడు పడితే వాడు ఎవరిని పడితే వారిని ఇష్టారాజ్యంగా చిత్రీకరించడం ఈ టెక్నాలజీ వెపన్‌కి ఉన్న ప్రమాదకర పార్శ్వంగా చూడాలి. గతంలోనూ ఇలానే హీరోయిన్ల శరీరాలను అర్ధనగ్నంగా చిత్రీకరించి శునకానందం పొందిన సంఘటనలు ఉన్నాయి.
ఐతే ఇలాంటివాటిని అనవసరంగా ప్రాపగాండా చేయకుండా చట్ట ప్రకారం చర్యలకు దిగాలంటారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. మానవసహజంగా ఉండే ఉత్సుకతతో ఇతరులకు కూడా తమ స్పందన ద్వారా క్యూరియాసిటీ పెంచారనేది ఆయన పాయింట్. చిత్రపరిశ్రమ వరకు అంటే కొంతమంది కలిసి కూర్చుని పోలీసులకు ఓ విజ్ఞప్తి చేయగలరు కానీ ఇతరుల పరిస్థితి ఏంటి. అందుకే ఏఐ టూల్స్ వాడకంపై ఖచ్చితంగా పర్యవేక్షణ ఉండాల్సిందే. అసలు ఒకరి అనుమతి లేకుండా కాదు, అనుమతితో కూడా ఇతరుల ఫోటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసేలా ఏఐ, డీప్ ఫేక్ టూల్స్‌కి పర్మిషన్ ఇవ్వకూడదు. లేకపోతే ఇవి ఇలా సాగుతూనే పోతాయి. రేపొద్దున్న చట్టపరమైన వివాదాల్లో కూడా ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు చొరబడితే ఏది సరైన సాక్ష్యం ఏది నకిలీ అని కూడా తేల్చలేని పరిస్థితులు ఉత్పన్నమవుతాయ్.
ప్రాంప్ట్ ఇస్తే చాలు వెంటనే ఎలా కావాలంటే అలా వీడియోలు, ఫోటోలు తయారు చేసి ఇవ్వడం వెనుక ప్రమాదం ఇప్పుడిప్పుడే జనాలకు అర్దమవుతోంది. కానీ ప్రతిసారీ దెబ్బ తగిలింది మనకి కాదు అని స్పేర్ చేయడమే ఈ పరిస్థితి మరింత దిగజారడానికి కారణమవుతోంది. ఇలాంటి డీఫ్ ఫేక్ వీడియోలు చేసే వాళ్లకు గట్టి దెబ్బ పడితేనే ఇంకోసారి ఇలాంటివి చేయకుండా ఉంటారు. లేకపోతే ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూనే ఉంటాయి.
Also Read : Supritha : పెళ్లి సంబంధాలు చూడమన్నాను.. నాకెలాంటి అబ్బాయి కావాలంటే.. పెళ్లిపై సుప్రీత కామెంట్స్ వైరల్..
ఏఐ రెండో పార్శ్వానికి ఇదే నిదర్శనం. ఫేమస్ పర్సనాలిటీలకే కాదు ఎవరికైనా ఇది ప్రమాదకరమే. ఎవరో హీరోయిన్ అంగాంగాన్నీ వెకిలిగా చూపించారని స్పేర్ చేస్తే రేపు సమాజంలోని ఆడాళ్ల ఫోటోలను కూడా వదలరు. డీప్ఫేక్గాళ్ల తాట తీయకపోతే ఎప్పటికైనా ప్రమాదమే. ఇప్పటికిది ఇండస్ట్రీకే పరిమితం. సాధారణ పౌరులూ బలిపశువులు అవుతారు ఇలాగే వదిలేస్తే.
