Pawan Kalyan
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా సెప్టెంబర్ 25 రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న హైప్ ఆకాశాన్ని అంటింది. పవర్ స్టార్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. OG సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి.(Pawan Kalyan)
తాజాగా OG సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా డబ్బింగ్ ని పూర్తి చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. నేడు ఉదయం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేసిన పవన్ నేడు మధ్యాహ్నం నుంచి OG డబ్బింగ్ పూర్తి చేసారు. డైరెక్టర్ సుజీత్, తమన్ దగ్గరుండి మరీ పవన్ కళ్యాణ్ తో డబ్బింగ్ చెప్పించారు.
ఎప్పుడూ సాధారణ డ్రెస్ లలో కనిపించే పవన్ కళ్యాణ్ తో సుజీత్ OG హుడీ వేయించి మరీ డబ్బింగ్ చెప్పించారు. పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పిన ఫొటోలను మూవీ యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తక్కువ టైం లోనే పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డబ్బింగ్ పూర్తి చేసారని తెలుస్తుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ త్వరగా టీజర్ లేదా ట్రైలర్ రిలీజ్ చేసి అప్డేట్స్ ఇవ్వమని అడుగుతున్నారు.
అలాగే కొద్దీ సేపటి క్రితమే పవన్, తమన్, సుజీత్ కలిసి ఉన్న ఫొటోని కూడా రిలీజ్ చేసారు. ఇలా వరుసగా పవన్ స్టైలిష్ ఫొటోలు షేర్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
THE OG SIGNS OFF IN STYLE exactly the way we all waited to see 😭🔥#OG #TheyCallHimOG pic.twitter.com/1O4cK22JYF
— DVV Entertainment (@DVVMovies) September 14, 2025
Also Read : The OG Boys : ‘ది OG బాయ్స్’.. పవర్ స్టార్ తో స్పెషల్ ఫొటో వైరల్.. ఇందులో పవన్ ని గమనించారా..?