Akira Nandan
Akira Nandan : పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. అకిరా అప్పుడప్పుడు పవన్ తో కలిసి కనిపిస్తూ తన లుక్స్ తో వైరల్ అవుతున్నాడు. అయితే అకిరా మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని, మ్యూజిక్ నేర్చుకుంటున్నాడని, ఓ షార్ట్ ఫిలింకి గతంలో మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా చేసాడని, తమన్ దగ్గర OG సినిమాకు మ్యూజిక్ డిపార్టుమెంటులో పని చేసాడని తమన్, రేణు దేశాయ్ స్వయంగా తెలిపారు.(Akira Nandan)
దీంతో అకిరా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని, హీరో అవుతాడో లేదో అని చర్చ నడుస్తుంది. కొంతమంది ఫ్యాన్స్ మాత్రం అకిరా ఎప్పటికైనా హీరో అవుతాడని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కి బాగా క్లోజ్ గా ఉండే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ 10 టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అకిరా తో సినిమా గురించి మాట్లాడారు.
Also See : Dil Raju : భార్య కొడుకుతో కలిసి దిల్ రాజు స్పెషల్ పూజలు.. ఫొటోలు వైరల్..
నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అకీరాతో సినిమా నేను కచ్చితంగా చేస్తాను. అయితే ఎలాంటి సబ్జెక్టు అనేది అకిరా ఇష్టం. అకీరాతో కూడా మాట్లాడాలి. నేనైతే అకిరాతో పాన్ వరల్డ్ సినిమా చేయాలని అనుకుంటున్నాను అని అన్నారు.
ఇప్పటికే విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమా చేసారు. ఆయనతో పర్సనల్ గా కూడా చాలా అనుబంధం ఉంది. మరి అకిరా ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్తే సినిమా తీయడానికి నిర్మాత రెడీగా ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ అకిరాని సినిమా చేయమని నిర్మాత కూడా రెడీ అని కోరుతున్నారు.
Also See : Sankranthi Movies : ప్రభాస్, చిరంజీవి ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. సంక్రాంతికి మరో పండగ భారం..