Sankranthi Movies : ప్రభాస్, చిరంజీవి ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. సంక్రాంతికి మరో పండగ భారం..

సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి. అసలే పండగ సీజన్..(Sankranthi Movies)

Sankranthi Movies : ప్రభాస్, చిరంజీవి ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. సంక్రాంతికి మరో పండగ భారం..

Sankranthi Movies

Updated On : December 15, 2025 / 4:22 PM IST

Sankranthi Movies : పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచమని చెప్పినా చివరి మూమెంట్లో పెంచుతున్నారు. రేట్లు పెంచకపోతే మాకు కష్టం అని నిర్మాతలు అంటున్నారు. మల్టిప్లెక్స్ లో ఉన్న ఫుడ్ రేట్స్ గురించి మాట్లాడకుండా టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నారని నిర్మాతలు అంటున్నారు. ఇటీవల అఖండ 2 కి కూడా టికెట్ రేట్లు పెంచారు. కానీ తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ నేను లేనపుడు నా శాఖ ఉద్యోగులు టికెట్ హైక్ ఇచ్చారు, ఇకపై టికెట్ రేట్ల పెంపు ఉండదు, స్పెషల్ షోలు ఉండవు అన్నారు.

అయితే సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి. అసలే పండగ సీజన్, మరి టికెట్ రేట్లు పెంచకుండా ఎలా ఉంటారు. దీంతో రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు సినిమాల ప్రెస్ మీట్స్ ఇటీవల జరగ్గా టికెట్ రేట్ల ప్రస్తావన వచ్చింది. ఈ రెండు సినిమాల నిర్మాతలు టికెట్ రేట్లు పెంచుతాం అనే అంటున్నారు.

Also Read : PM Modi : ప్రధాని మోదీకి ‘అఖండ 2’ స్పెషల్ షో.. బాలయ్య మోదీని కలుస్తారా..?

చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా నిర్మాత.. అఖండ 2 సినిమాకు కూడా 3 రోజులు టికెట్ రేట్లు పెంచడానికి కోర్టు అంగీకరించింది. కాబట్టి సంక్రాంతికి వస్తున్న మా సినిమాకు కూడా స్పెషల్ జీవో వస్తుందనే నమ్ముతున్నాం. మేము టికెట్ రేట్లు పెంచేది కేవలం 3 రోజులు మాత్రమే. అది కూడా కేవలం 50 నుంచి 70 రూపాయలు మాత్రమే పెంచుతామని అన్నారు. అలాగే థియేటర్లలో స్నాక్స్ రేట్లు మాత్రం 4 రెట్లు అధికంగా ఉన్నా వాటి గురించి ఎవరూ మాట్లాడటం లేదు అని అన్నారు.

ఇక రాజాసాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాము. ఓ సినిమాకు డబ్బులు పెట్టడం మా చేతిలో ఉంటుంది. టికెట్ రేట్లు పెంచాలా వద్దా అనే నిర్ణయం మా చేతిలో ఉండదు. కానీ రిలీజ్ సమయంలో కచ్చితంగా టికెట్రేట్ల పెంపు కోసం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తామని అన్నారు. దీంతో సంక్రాంతి సినిమాల టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోల కోసం టాలీవుడ్ స్టార్స్, నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డిని త్వరలోనే కలిసే అవకాశం ఉంది.

Also Read : Nandamuri Mokshagna: మొదటి సినిమానే ఉపేంద్రతో.. సీక్వెల్ కోసమే.. చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు..

ఇక ఏపీ ప్రభుత్వం టికెట్ పెంపుకు, స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుకూలంగా ఉంది కాబట్టి ఏపీలో టికెట్ రేట్లు కచ్చితంగా పెరుగుతాయి. మరి ఎంత పెరుగుతాయో, ఎన్ని రోజులు పెరుగుతాయో చూడాలి. టికెట్ రేట్ల పెంపుతో పండక్కి చిరంజీవి, ప్రభాస్ ఫ్యాన్స్, సామాన్య ప్రేక్షకులకు మరో పండగ భారం తప్పేట్టు లేదు. ఇక సంక్రాంతికి ఈ సినిమాలతో పాటు రవితేజ, శర్వానంద్, విజయ్, నవీన్ పోలిశెట్టి, శివకార్తికేయన్ సినిమాలు కూడా ఉన్నాయి.