PM Modi : ప్రధాని మోదీకి ‘అఖండ 2’ స్పెషల్ షో.. బాలయ్య మోదీని కలుస్తారా..?

అఖండ 2 సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. (PM Modi)

PM Modi : ప్రధాని మోదీకి ‘అఖండ 2’ స్పెషల్ షో.. బాలయ్య మోదీని కలుస్తారా..?

PM Modi

Updated On : December 15, 2025 / 3:33 PM IST

PM Modi : బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ 2 సినిమా థియేటర్స్ లో మాస్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమా ముందే చెప్పిన డేట్ కి రిలీజ్ చేసి ఉంటే మంచి హైప్ తోఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చి దూసుకుపోయేది. కానీ పలు కారణాలతో వాయిదా పడటంతో హైప్ తగ్గిపోయి ఓపెనింగ్స్ అనుకున్నంత రాలేదు. కానీ మాస్ ప్రేక్షకులకు, సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్లకు, దేశభక్తులకు ఈ సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది.

అఖండ 2 సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నార్త్ లో కూడా బాగా ప్రమోషన్స్ చేసారు. యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ కి ఇప్పటికే సినిమాలో కొంతభాగం మూవీ యూనిట్ కలిసి చూపించారు. బాలయ్య, బోయపాటి, సంయుక్త, నిర్మాతలు యోగి ఆదిత్యనాథ్ ని కలిశారు. ఆయనకు ఈ సినిమా నచ్చేసింది.

Also Read : Ranveer Singh: దీపికా ఇది వినవమ్మా.. అలా చేయడం తప్పుకాదట.. భార్యకు కౌంటర్ ఇచ్చిన రణవీర్

అయితే ఇప్పుడు అఖండ 2 సినిమా ప్రధాని నరేంద్ర మోదీ చూస్తారట. ఇటీవల జరిగిన అఖండ 2 సక్సెస్ మీట్ లో బోయపాటి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ గారు అఖండ 2 గురించి విన్నారు. ఈ సినిమాపై ఆసక్తి చూపించారు. త్వరలోనే ఢిల్లీలో ఈ సినిమాకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం. ఆ షోను మోడీ గారు కూడా చూస్తారు అని తెలిపారు. ఢిల్లీలో ఎంపీలకు అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలను ప్రదర్శిస్తారని తెలిసిందే.

ఈ క్రమంలో అఖండ 2 కూడా త్వరలోనే ఎంపీలకు స్పెషల్ షో వేయనున్నారు. ఈ షోకి ప్రధాని మోదీ కూడా హాజరవుతారని సమాచారం. దీంతో బాలయ్య, బోయపాటి కూడా ఈ షోకి హాజరవుతారా, మోదీని కలుస్తారా అనే చర్చ నెలకొంది. అసలే ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో బాలయ్య మోదీని కలుస్తారని వార్త ఫ్యాన్స్ తో పాటు కార్యకర్తల్లో సంతోషాన్ని నింపుతుంది. మరి మోదీ వచ్చి అఖండ 2 సినిమా చూస్తారా బాలయ్యని కలుస్తారా చూడాలి.

Also Read : Rewind 2025: 2025 బ్లాక్ బస్టర్ తెలుగు సినిమాలు.. అంచనాలకు మించి..