Pawan Kalyan : అక్కచెల్లమ్మల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుంది.. రాఖీ శుభాకాంక్ష‌లు తెలిపిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు.

Pawan Kalyan Rakhi wishes to women

Pawan Kalyan : రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు. ర‌క్షాబంధ‌న్ అనేది అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక అని అన్నారు. శ్రావణ పౌర్ణమినాడు వచ్చే ఈ రాఖీ పండుగ ఆనందాల వేడుక అని తెలిపారు. ఈ శ్రావణ పౌర్ణమి దేశవాసులందరికీ శుభాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న‌ట్లు తెలియ‌జేశారు. ఈ మేర‌కు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

‘సోదర సోదరి ప్రేమ అనుభవైక్యంతోనే అర్థమవుతుంది. అక్కచెల్లమ్మల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుంది. విప్లవ కవి గద్దరన్న పాడినట్లు చెల్లెలు పాదం మీద పుట్టుమచ్చగానో.. అక్క నుదుటున తిలకంగానో అలంకృతమైనప్పుడే ఆ రుణం తీరుతుందేమో! అదేవిధంగా అన్నదమ్ముల ఆప్యాయతకు ఎవరు వెలకట్టగలరు? వీరిని జీవితాంతం గుండెల్లో గుడికట్టి పూజించడం తప్ప!

Prabhas : ప్ర‌భాస్ పై బాలీవుడ్ న‌టుడి కామెంట్లు.. ఘాటుగా స్పందించిన టాలీవుడ్ నిర్మాత

అటువంటి అనురాగానికి ప్రతీకైన రక్షాబంధన్ పండుగ శుభతరుణాన సోదర సోదరీమణులందరికీ అనురాగపూర్వక శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతితో భాగమైన ఈ వేడుకను శ్రావణ పౌర్ణమినాడు ప్రేమైక మనస్సులతో భారతీయులతో పాటు దక్షిణ, తూర్పు ఆసియా దేశాలలో వైభవంగా జరుపుకునే ఈ పండుగ చేసుకోవడం సోదర సోదరీమణుల అనురాగానికి ప్రతీక. ఈ శ్రావణ పౌర్ణమి దేశవాసులందరికీ శుభాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు.’ అని పవన్ కల్యాణ్ రాసుకొచ్చారు.

ట్రెండింగ్ వార్తలు