మా బంగారు తల్లి స్వప్న.. విశాఖపట్నం వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను.. జాగ్రత్త అమ్మ!

  • Publish Date - September 4, 2020 / 06:15 PM IST

Pawan Kalyan Drawing by Lady fan Swapna: జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు సందర్భంగా సెప్టెంబ‌ర్ 2న ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో హంగామా చేశారు. ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ప‌వ‌న్‌కు పుట్టిన‌రోజు అభినంద‌న‌లు తెలిపారు.


పవర్ స్టార్‌ కొత్త సినిమాల ప్రకటనలతో పాటు షూటింగ్ స్టార్ట్ అయిన సినిమాల అప్ డేట్స్‌తో టాలీవుడ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అయితే పవన్ పుట్టినరోజు నాడు స్వ‌ప్న అనే ఓ మ‌హిళా అభిమాని చేసిన ప‌ని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.


వివ‌రాల్లోకెళ్తే.. స్వ‌ప్న దివ్యాంగురాలు. ఆమెకు రెండు చేతులు లేవు. అయినా కూడా నోటితో ప‌వ‌న్ ఫొటోను డ్రా చేసి, వీడియో ద్వారా ప‌వ‌న్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. స్వ‌ప్న చేసిన ప‌ని ప‌వ‌న్ దృష్టికి వెళ్ల‌డంతో ఆయ‌న కూడా స్పందించారు.


‘‘మా బంగారు తల్లి స్వప్నకి, నువ్వు వేసిన నా డ్రాయింగ్ నా దృష్టికి మన జనసైనికులు తీసుకొచ్చారు, చాలా చక్కగా ఉంది తల్లి.. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. జాగ్రత్త అమ్మ! ’’ అని ట్వీట్ చేశారు పవన్.