Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Teaser Release date
Bro Movie Teaser : మెగా హీరోలు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తమిళ్ చిత్రం ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ టీజర్ కి సంబంధించిన పవన్ డబ్బింగ్ పూర్తి కాకపోవడంతో టీజర్ రిలీజ్ టైం ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు.
Leo : ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే సంచలనం సృష్టిస్తున్న విజయ్ లియో.. 275 కోట్ల మూవీకి 422 కోట్ల!
తాజాగా పవన్ కూడా తన డబ్బింగ్ ని పూర్తి చేసేశాడు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో దర్శకుడు సముద్రఖని ఆధ్వర్యంలో పవన్ తన డబ్బింగ్ ని కంప్లీట్ చేశాడు. దీంతో చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేసేసింది. ఈ టీజర్ ని రేపు సాయంత్రం 5:04 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ అప్డేట్ తో మెగా అభిమానులు ‘ఇక మనల్ని ఎవరూ ఆపలేరు’ అంటూ సందడి చేస్తున్నారు.
The STORM will set off at his Snap ?
మీరే చూస్తారుగా!!!#BroTeaser Tomorrow at 5:04PM ?@PawanKalyan @IamSaiDharamTej@thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @lemonsprasad @SVR4446 @peoplemediafcy @ZeeStudios_ @zeestudiossouth#BROFromJuly28 pic.twitter.com/SJ8vlggg7k— People Media Factory (@peoplemediafcy) June 28, 2023
కాగా ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. పవన్ మోషన్ పోస్టర్ కి ఇచ్చిన సంగీతం మంచి హైప్ ని క్రియేట్ చేసింది. దీంతో టీజర్ కి ఏ రేంజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వబోతున్నాడా? అని ఆడియన్స్ లో ఆసక్తి నెలకుంది. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ (Ketika Sharma) సాయి ధరమ్ కి జోడిగా కనిపించబోతుందని, అలాగే ప్రియా వారియర్ చెల్లి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని జులై 28న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.