Pawan Kalyan Shares a Selfie from HariHara VeeraMallu Movie Sets Post goes Viral
Pawan Kalyan : పొలిటికల్ గా బిజీ అయిన పవన్ కళ్యాణ్ గ్యాప్ దొరికినప్పుడల్లా తన చేతిలో ఉన్న సినిమాలకు డేట్స్ ఇచ్చి పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలో ముందు హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. మంగళగిరిలో వేసిన ఓ సెట్ లో ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసారు. హరిహర వీరమల్లు సెట్స్ లో దిగిన సెల్ఫీని షేర్ చేసి.. చాలా బిజీగా ఉండే పొలిటికల్ షెడ్యూల్స్ నుంచి నా సమయంలో కొన్ని గంటలు ఎన్నాళ్ళ నుంచో పెండింగ్ లో ఉన్న వర్క్ కి కేటాయించాను అని పోస్ట్ చేసాడు. దీంతో పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్ గా మారింది.
Also Read : Pushpa 2: ఇలా అయితే సినిమాలు చూసేది ఎలా?
పవన్ ఇలా సెల్ఫీ పెట్టడం, అది కూడా హరిహర వీరమల్లు సెట్స్ నుంచి పెట్టడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అంతేకాకుండా పొద్దునంతా ఏపీ కోసం పనిచేసి ఇంత అర్ధరాత్రి వరకు షూటింగ్స్ చేస్తుండటంతో ఆయన ఓపికని అభినందిస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమా వచ్చే సంవత్సరం మార్చ్ 28 విడుదల కానుంది.