Pawan Kalyan Speak with Media on his Son Mark Shankar Health before he Leaving to Singapore
Pawan Kalyan : నేడు ఉదయం పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుతున్న స్కూల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. దీంతో మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉండటంతో సాయంత్రం వరకు పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ వచ్చారు. నేడు రాత్రికి సింగపూర్ వెళ్లనున్నారు. సింగపూర్ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్.
Also Read : PM Modi Calls Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా
పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బాధ కలిగింది. చిన్న ప్రమాదం అనుకున్నాను. ప్రమాద తీవ్రత ఊహించలేదు. మార్క్ శంకర్ కు బ్రాంకో స్కోపి జరుగుతుంది. నా పెద్దకొడుకు అకీరా పుట్టిన రోజు నాడు చిన్న కొడుకు కి ఇలా జరగడం బాధాకరం. మార్క్ శంకర్ కు కాళ్ళు, చేతులకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళింది. డాక్టర్స్ ఇంకా ఏం చెప్పలేదు. రేపు ఉదయం వరకు చెప్తానన్నారు డాక్టర్స్. ఇండియాలోని సింగపూర్ హై కమిషన్ కూడా మాట్లాడారు. ఇవాళ రాత్రికి నేను సింగపూర్ కి వెళ్తున్నాను. వెళ్లొచ్చాక మళ్ళీ మన్యం జిల్లాలకు వెళ్తాను. మోదీ గారు ఫోన్ చేసి పరామర్శించారు అని తెలిపారు.
అలాగే.. పవన్ తనయుడు కోలుకోవాలని ట్వీట్స్ వేసిన వారికి, పరామర్శించిన రాజకీయ నాయకులకు, ఫ్యాన్స్ కి, జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.