PM Modi Calls Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా
మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యాడని తెలియగానే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు.

PM Modi Calls Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. పవన్ చిన్న కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అలాగే పవన్ కు ధైర్యం చెప్పారు మోదీ.
సింగపూర్ లో మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్ లో అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగ అలుముకుంది. ఆ పొగ మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లుగా సమాచారం అందుతోంది. శంకర్ అస్వస్థతకు గురి కావడంతో వెంటనే స్కూల్ యాజమాన్యం అతడిని ఆసుపత్రిలో చేర్పించింది. శంకర్ కు డాక్టర్లు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పవన్ కల్యాణ్ హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రికి సింగపూర్ వెళ్లనున్నారు పవన్ కల్యాణ్.
Also Read : పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు.. సింగపూర్‌కు డిప్యూటీ సీఎం..
మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యాడని తెలియగానే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం స్పందించారు. ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్, మంత్రులు లోకేశ్, మాజీమంత్రి కేటీఆర్, హీరో నాగార్జున సహా పలువురు సెలబ్రిటీలు పోస్టులు పెట్టారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని పవన్ కు ధైర్యం చెబుతూ వారు పోస్టులు పెడుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ సైతం పవన్ కల్యాణ్ కు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాగా, పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పర్యటనలో ఉన్నారు. నిన్న పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో పర్యటించారు. గిరిజనులతో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న అడవితల్లి బాట ప్రోగ్రాంను పవన్ ప్రారంభించారు. ఇవాళ కూడా పలు కార్యక్రమాల్లో పవన్ పాల్గొనాల్సి ఉంది. అయితే, చిన్న కుమారుడి విషయం తెలియగానే పవన్ అక్కడి నుంచి వచ్చేశారు. రాత్రికి సింగపూర్ వెళ్లనున్నారు పవన్ కల్యాణ్.