పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు.. సింగపూర్‌కు డిప్యూటీ సీఎం..

పవన్‌ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు.. సింగపూర్‌కు డిప్యూటీ సీఎం..

Updated On : April 8, 2025 / 10:04 AM IST

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌కు అగ్నిప్రమాదంలో గాయాలయ్యాయి. సింగపూర్‌లో స్కూల్‌లో అగ్నిప్రమాదంలో సంభవించడంతో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అంతేగాక, అతడి ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది.

మార్క్‌ శంకర్‌ను స్కూల్‌ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. దీంతో పవన్ కల్యాణ్ సింగపూర్‌ వెళ్లనున్నారు. పవన్‌ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ గిరిజనులను కలిశాక సింగపూర్‌ వెళ్తానని పవన్‌ అన్నారు. ఇవాళ ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది.

కాగా, పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పర్యటనలో ఉన్నారు. నిన్న పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో ఆయన పర్యటించి, గిరిజనులతో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న అడవితల్లి బాట ప్రోగ్రాంను ప్రారంభించారు.

పవన్ కల్యాణ్ ఇవాళ సుంకరమిట్టలో బ్రిడ్జిని ప్రారంభించాల్సి ఉంది. అలాగే, విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్క్‌ వద్ద ఎకో టూరిజంపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ టూరిజం అభివృద్ధి, ఎకో టూరిజంపై ఆయన చర్చిస్తారు.