Pawan Kalyan special Birthday wishes to his brother Megastar Chiranjeevi
Pawan Kalyan : నేడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పుట్టిన రోజు కావడంతో టాలీవుడ్ ప్రముఖులు, సినీ, రాజకీయ ప్రముఖులు, వేరే పరిశ్రమల సెలబ్రిటీలు, అభిమానులు.. అంతా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అభిమానులు అయితే అన్నయ్య పుట్టిన రోజుని పండగలా చేసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా మెగాస్టార్ కి విషెష్ చెప్తున్నారు.
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవికి ప్రత్యేకంగా చిన్నప్పటి ఫోటో షేర్ చేసి స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు జరిగిన చిరంజీవి పుట్టిన రోజు ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. అడుగడుగునా స్ఫూర్తినిచ్చిన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
Mega 157 : మెగా 157.. సోషియో ఫాంటసీ కథతో మరింత కొత్తగా రాబోతున్న మెగాస్టార్
పవన్ కళ్యాణ్ ఇంత పాత ఫోటో షేర్ చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. దీంతో అభిమానులునతా ఆశ్చర్యపోయారు. పవన్ చిన్నప్పుడు ఫోటో కావడంతో భలే క్యూట్ గా ఉన్నాడు పవన్ అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక కామెంట్స్ లో చిరంజీవికి విషెష్ తెలుపుతున్నారు.