Pawan Kalyan Special Tamil Interview goes Viral Pawan Kalyan Speaks in Tamil
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ పక్క ప్రభుత్వ కార్యకలాపాలతో మరో పక్క సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా లడ్డు వివాదంలో పవన్ కళ్యాణ్ వైరల్ అవుతున్నారు. ఈ క్రమంలో ఓ తమిళ మీడియాకు పవన్ కళ్యాణ్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ లడ్డు వివాదం, సనాతన ధర్మం, తమిళ సినీ పరిశ్రమ, తమిళనాడు, తాను చిన్నప్పుడు చెన్నైలో పెరిగిన రోజుల గురించి.. ఇలా అనేక విషయాలు మాట్లాడారు.
అయితే ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తమిళ్ లో అనర్గళంగా మాట్లాడారు. అచ్చం తమిళ వ్యక్తిలాగే మాట్లాడారు కొన్ని చోట్ల ఇంగ్లీష్ మిక్స్ చేస్తూ తమిళ్ లోనే యాంకర్ అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చారు. దీంతో ఈ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో కట్ చేసి ఫ్యాన్స్ మరింత వైరల్ చేస్తున్నారు.
ఈ వీడియోలు చూసి పవన్ కళ్యాణ్ ఇంత బాగా తమిళ్ మాట్లాడగలడా, పవన్ కళ్యాణ్ కి తమిళ్ వచ్చా అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. మొదటిసారి పవన్ ఈ రేంజ్ లో తమిళ్ మాట్లాడటం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ ఫుల్ ఇంటర్వ్యూ మీరు కూడా చూసేయండి..