Pawan Kalyan Daughters : ఇద్దరు కూతుళ్లతో పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్.. మొదటిసారి బయటకు వచ్చిన చిన్న కూతురు..
తిరుమల దర్శనానికి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూతుళ్లు వచ్చారు.

Pawan Kalyan Visited Tirumala with his Two Daughters
Pawan Kalyan Daughters : తాజాగా పవన్ కళ్యాణ్ తిరుమల వెళ్లారు. నిన్న రాత్రి కాలి నడకన అలిపిరి మార్గంలో పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్లారు. అయితే తిరుమల దర్శనానికి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూతుళ్లు వచ్చారు.
పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజనోవా కూతురు పలీనా అంజని గతంలో ఎప్పుడో చిన్నప్పుడు మీడియాకు కనపడింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చింది.
పలీనా అంజని క్రిష్టియన్ కావడంతో టీటీడీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి వెళ్లారు. దీంతో పవన్ కళ్యాణ్ చిన్న కూతురు ఈమెనే అని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఇద్దరు కూతుళ్లతో కలిసి పవన్ కళ్యాణ్ మొదటిసారి కనిపించడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఆద్య, పలీనా అంజని ఒకేలా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.