Pawan Kalyan Sujeeth They Call Him OG Movie Releasing Date Announced
Pawan Kalyan : పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆయన చేతిలో ఉన్న సినిమాలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. కానీ ఇటీవల ఆ సినిమాలని వేగంగా పూర్తిచేసే పనిలో పడ్డారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూట్ పూర్తిచేయడంతో ఆ సినిమా జూన్ 12 రిలీజ్ కి రెడీ అయింది. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న OG సినిమా రిలీజ్ డేట్ కూడా నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 25న OG సినిమా రిలీజ్ చేస్తున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం పవన్ OG సినిమాకు డేట్స్ ఇస్తున్నారు. ఓ 20 రోజులు డేట్స్ ఇస్తే షూటింగ్ పూర్తయిపోతుంది.
ఫ్యాన్స్ లో, ప్రేక్షకుల్లో OG సినిమాకు ఎంత క్రేజ్ ఉందో తెల్సిందే. పవన్ ఏ రాజకీయ మీటింగ్ కి వెళ్లినా OG OG అని అరుస్తారని తెలిసిందే. అంత హైప్ ఉన్న సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో ఈ సంవత్సరం పవర్ స్టార్ థియేటర్స్ లో రెండు సార్లు ఫ్యాన్స్ ని అలరించబోతున్నారు.
FIRING WORLDWIDE in cinemas on
25th September 2025… 💥💥💥💥#OGonSept25#TheyCallHimOG #OG pic.twitter.com/DQAOFOrQxx
— DVV Entertainment (@DVVMovies) May 25, 2025