Allu Aravind: పవన్ బాధలో 100 శాతం నిజముంది.. పవన్ మూవీ రిలీజ్‌కు ముందు థియేటర్లు ఎలా మూస్తారు?- అల్లు అరవింద్
మాది ప్రైవేట్ వ్యాపారం.. ప్రభుత్వానికేం సంబంధం లేదంటే రెండేళ్ల ముందు జగన్ ని ఎందుకు కలిశారు?

Allu Aravind: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమపై సీరియస్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఆ నలుగురితో నాకు సంబంధం లేదని ఆయన అన్నారు. నేను ఆ నలుగురిలో లేను అని క్లారిటీ ఇచ్చారు.
”తెలుగు రాష్ట్రాల్లో 1500 ధియేటర్లు ఉంటే ఇప్పుడు 15 మాత్రమే ఉన్నాయి. లీజ్ అయ్యాక అవి కూడా కొనసాగించే ఉద్దేశం లేదు. నా దగ్గర ఆ ధియేటర్లు లేవు. పెద్దల ఫొటోలు వేస్తే బావుంటాయని నా ఫొటో వేస్తున్నారు. ఆ నలుగురిలో నన్ను కలపొద్దు. సినిమాటోగ్రఫీ మంత్రి రియాక్ట్ అయిన విధానం సమంజసమే. ధియేటర్లకు సంబంధించిన 3 మీటింగ్ లకి నేను వెళ్లలేదు. మా అసోసియేట్ ప్రొడ్యూసర్లను కూడా వెళ్లొద్దన్నా. పవన్ సినిమా వస్తుండగా హాల్ మూస్తామనడం దుస్సాహసం. అలా చేయకూడదు. పెద్దలు, చిన్నలు ఎవరూ కూడా చేయకూడదు.
మన ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఎవరేం అడిగినా పవన్ హెల్ప్ చేస్తున్నారు. అశ్వినీదత్ సినిమా కోసం మేం వెళ్లినప్పుడు ఆయన బాబుగారిని కలిశారా? అని పవనే అడిగారు. ఆ తర్వాత ఇండస్ట్రీ పరంగా ఒక్క టీమ్ వెళ్లి ఎప్పుడూ కలవలేదు. మాది ప్రైవేట్ వ్యాపారం.. ప్రభుత్వానికేం సంబంధం లేదంటే రెండేళ్ల ముందు జగన్ ని ఎందుకు కలిశారు? ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది. సర్కారు కో ఆపరేషన్ కావాలి. మంత్రి కందుల దుర్గేశ్ ప్రశ్నలు సమంజసమే” అని అల్లు అరవింద్ అన్నారు.
Also Read: మన యూనిటీ ఎలా ఉంది..? పవన్ కళ్యాణ్ లేఖపై స్పందించిన గీత ఆర్ట్స్ నిర్మాత.. ట్వీట్ వైరల్..