Pawan Kalyan
Pawan Kalyan : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్న సంగతి తెలిసిందే. బైక్ ప్రమాదంలో గాయపడిన హీరో.. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అయితే మరో వైపు సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతోంది. ముందుగా నిర్ణయించిన తేదీకే సినిమా విడుదల చేయాలని చిత్రయూనిట్ ఫిక్స్ అయింది. అందుకే అక్టోబర్ 1న సినిమాను రిలీజ్ చేసేందుకు అంతా సిద్దం చేసింది.
ఇక ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్ నగరంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సందర్బంగా ఆయన సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యపరిస్థితిపై స్పందించారు. తేజ్ ఇంకా బెడ్ పైనే ఉన్నాడని కళ్ళు తెరవలేదని అన్నారు. అభిమానుల ప్రేమానురాగాలతో త్వరగా కోలుకుంటున్నాడని త్వరలోనే పూర్తిగా కోలుకొని ఇంటికి వస్తాడని పవన్ తెలిపారు.
ఇక ఇప్పటివరకు తేజ్ సినిమా వేడుకలకు తానూ హాజరుకాలేదని, కానీ ఇప్పుడు రావాల్సి వచ్చిందని తెలిపారు. తేజ్ తన సొంతకాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతోనే తానెప్పుడూ ఇలాంటి ఈవెంట్స్ కి వచ్చే వాడిని కాదని పవన్ తెలిపారు. సాయి ధరమ్ తేజ్ కి ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉండటంతో అతడు రాలేకపోయాడని.. తేజ్ లేని లోటు కనపడకుండా ఉండేందుకు తాను వచ్చానని వివరించారు.