×
Ad

Pawan Kalyan : మెగా షో తర్వాత పవన్ కళ్యాణ్ కామెంట్స్.. OG యూనివర్స్ ఉంది.. వీడియో వైరల్..

నిన్న రాత్రి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో మెగా ఫ్యామిలీ స్పెషల్ గా OG షో చూశారు. (Pawan Kalyan)

Pawan Kalyan

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా ఇటీవల థియేటర్స్ లో రిలీజయి పెద్ద విజయం సాధించి ఇప్పటికే దాదాపు 270 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. నిన్న రాత్రి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో మెగా ఫ్యామిలీ స్పెషల్ గా OG షో చూశారు. ఈ షోకి ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. అంతే కాకుండా OG మూవీ టీమ్ కూడా షోకి హాజరైంది.(Pawan Kalyan)

ఇప్పటికే ఈ స్పెషల్ షోకి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. తాజాగా ఈ షోకి సంబంధించిన స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ సినిమా అయిన తర్వాత మాట్లాడారు.

Also Read : Mega Family : చాన్నాళ్ల తర్వాత నాన్నతో అకిరా, ఆద్య.. అసలు OG షోకి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరెవరు వచ్చారు?

OG మెగా షో అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అందరికి అభినందనలు. అందరూ బాగా వర్క్ చేసారు. సుజీత్, తమన్ టీమ్స్ అందరికి కంగ్రాట్స్. నాకు కలెక్షన్స్, సక్సెస్ గురించి తెలీదు కానీ ఇది ఒక గ్రేట్ వాచ్ సినిమా. తమన్ గ్రేట్ వర్క్. నవీన్ ఎడిట్ తో క్రేజీ చేసాడు. మ్యాడ్ ఎడిట్ చేసాడు. మళ్ళీ ఓజీ యూనివర్స్ లో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా. సుజీత్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా సుజీత్ క్రియేషన్. తమన్ పొటెన్షియల్ ని సుజీత్ వాడుకున్నాడు. ఓజీ యూనివర్స్ లో పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది అని అన్నాడు.

దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇటీవల సుజీత్, తమన్ ఇంటర్వ్యూలలో OG సినిమాకు సీక్వెల్స్, ప్రీక్వెల్స్ ఉన్నాయని, సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అని చెప్పారు. ఇప్పుడు పవన్ స్వయంగా OG యూనివర్స్ ఉంది, దాంట్లో మళ్ళీ కలుద్దాం అని ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దీంతో పవన్ నెక్స్ట్ OG సీక్వెల్స్ లో నటిస్తాడని క్లారిటీ వచ్చేసింది.

Also Read : OG Song : OG సినిమా ‘సువ్వి సువ్వి..’ సాంగ్ షూట్ చేసింది ఇక్కడే.. ఈ హిస్టారికల్ ప్లేస్ ఎక్కడో తెలుసా?