OG Song : OG సినిమా ‘సువ్వి సువ్వి..’ సాంగ్ షూట్ చేసింది ఇక్కడే.. ఈ హిస్టారికల్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
OG సినిమా సువ్వి సువ్వి సాంగ్ లో కొన్ని సన్నివేశాలు ఓ ఆలయం వద్ద షూటింగ్ చేసారు. (OG Song)

OG Song
OG Song : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా ఇటీవల రిలీజయి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ కి ముందే ఈ సినిమా సాంగ్స్ కూడా పెద్ద హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి వచ్చిన ఒకేఒక మెలోడీ సాంగ్ సువ్వి సువ్వి.. కూడా అందర్నీ మెప్పించింది. పవన్ కళ్యాణ్, హీరోయిన్ ప్రియాంక మోహన్ మీద ఈ సాంగ్ ని చిత్రీకరించారు.(OG Song)
ఈ సువ్వి సువ్వి సాంగ్ లో కొన్ని సన్నివేశాలు ఓ ఆలయం వద్ద షూటింగ్ చేసారు. ఓ ఘాట్ వద్ద హీరో, హీరోయిన్ దీపాలు వదిలినట్టు సీన్ కూడా ఉంటుంది. ఈ సీన్స్ అన్ని ఎక్కడ షూట్ చేసారో తెలుసా? OG సినిమా ఎక్కువగా ముంబై, పూణే పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా కూడా ముంబై, జపాన్ బ్యాక్ డ్రాప్ కథతోనే సాగుతుంది.
Also Read : Mega Family : చాన్నాళ్ల తర్వాత నాన్నతో అకిరా, ఆద్య.. అసలు OG షోకి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరెవరు వచ్చారు?
సువ్వి సువ్వి సాంగ్ పూణేకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనావాలి ఘాట్ వద్ద చిత్రీకటించారు. ఇది సతారా జిల్లాలోని మీనావాలి అనే గ్రామంలో ఉంది. 18వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యంలో పనిచేసే రాజప్రతినిధి అయిన నానా ఫడ్నవీస్ ఇక్కడ ఆలయాన్ని, కోటను నిర్మించారు. ఇక్కడ పురాతనమైన విష్ణువు, శివుడి ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలు పక్కనే ఓ నది పాయ కోనేరుగా మారింది. ఆ కోనేరులోనే హీరో – హీరోయిన్ దీపాలు వదిలిన సీన్ షూటింగ్ చేసారు. మరికొన్ని షాట్స్ కూడా ఈ ఆలయం చుట్టుపక్కలే చిత్రీకరించారు ఆ పాటలో.
ఈ మీనావాలి ఘాట్ లో OG సినిమా కంటే ముందే చాలా బాలీవుడ్ సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి. యుధ్, మృత్యుదండ్, గూంజ్ ఉతీ షెహనాయ్, జిస్ దేశ్ మే గంగా రెహతా హై, గంగాజల్, స్వదేశ్.. లాంటి చాలా బాలీవుడ్ సినిమాలు గతంలో ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఇక్కడకు పూణే వరకు వెళ్లి అక్కడ్నుంచి మీనావలికి వెళ్లే బస్సు ద్వారా ప్రయాణం చేయొచ్చు.

Image Credits : Anup Gandhe Instagram
ఈ ప్లేస్ లో షూటింగ్ చేసిన OG సాంగ్ ఇదే..