Pawan Kalyan : అమెరికాలో పవన్ కళ్యాణ్ OG దూకుడు.. పుష్ప, దేవర, సలార్ రికార్డ్ లను బద్దలుకొట్టి..

అమెరికాలో కూడా మన తెలుగు సినిమాలు అదరగొడతాయని తెలిసిందే. OG సినిమా నార్త్ అమెరికాలో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.(Pawan Kalyan)

Pawan Kalyan

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమా హైప్ ఆకాశాన్ని అంటింది. పవన్ ఫ్యాన్స్ ఎక్కడ చూసినా OG OG అనే అరుస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుంది.(Pawan Kalyan)

ఇక అమెరికాలో కూడా మన తెలుగు సినిమాలు అదరగొడతాయని తెలిసిందే. OG సినిమా నార్త్ అమెరికాలో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. OG సినిమా విడుదలకు 21 రోజుల ముందే నార్త్ అమెరికాలో ఏకంగా 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. అంటే ఆల్మోస్ట్ 8 కోట్లకు పైగా వసూలు చేసింది. నార్త్ అమెరికాలో ఇన్ని రోజుల ముందు 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ OG సినిమానే. అమెరికాలో అత్యంత వేగంగా 1 మిలియన్ కలెక్ట్ చేసిన తెలుగు సినిమాగా OG సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.

Also Read : Alcohol Teaser : ఆక‌ట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్క‌హాల్’ టీజ‌ర్‌..

గతంలో సినిమా రిలీజ్ కి 21 రోజులు ముందు పుష్ప 2 750K డాలర్స్ కలెక్ట్ చేయగా, దేవర 411K డాలర్స్, సలార్ 320K డాలర్స్ వసూలు చేసాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికాలో కూడా OG హైప్ భారీగా ఉంది. రిలీజ్ కి ఇన్ని రోజుల ముందే కలెక్షన్స్ అదరగొడుతుంది అంటే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మళ్ళీ తన స్టామినా చూపించి బాక్సాఫీస్ బద్దలుకొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

Also See : Divi : చీరకట్టులో అలరిస్తున్న నటి దివి.. ఫొటోలు..