Pawan Kalyan To Start New Schedule Of Hari Hara Veeramallu
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో నటిస్తున్న పీరియాడిక్ ఫిక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ జరుపుకుంది. ఇంకా ఈ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా, పవన్ తన వేరే సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వలన ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీంతో, వీరమల్లు మూవీ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా.. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
Pawan Kalyan: నాని హీరోయిన్‌తో పవన్ రొమాన్స్.. మామూలుగా ఉండదుగా..?
కాగా, ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌కు సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ఏప్రిల్ 13 నుండి హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ఓ భారీ సెట్‌లో ప్రారంభించనున్నారు. ఇక పవన్ కల్యాణ్ ఈ షెడ్యూల్‌లో ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొంటాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో పవన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.
Pawan Kalyan: పవన్ ‘ఓజి’ని అలా మొదలుపెడతాడా.. ఓపెనింగ్‌తోనే దద్దరిల్లడం ఖాయం!
అందాల భామ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మొఘల్ కాలం నాటి నేపథ్యంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.