Pawan Kalyan: దూసుకెళ్తున్న ఉస్తాద్.. వీరమల్లును కూడా ముగించేస్తాడా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్ర షూటింగ్లో పవన్ జాయిన్ అయ్యాడు.

Pawan Kalyan To Speed Up Hari Hara Veera Mallu Shoot
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన స్టార్ట్ చేసిన ‘హరిహర వీరమల్లు’ 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో పాటు దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ముగించేసుకున్నాడు పవన్. ఈ సినిమాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో సెట్ అయ్యాయి.
ఇక ఇప్పుడు దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్ర షూటింగ్లో పవన్ జాయిన్ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్‌ను కూడా వీలైనంత త్వరగా ముగించేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కెరీర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ చాలా పవర్‌పుల్‌గా డిజైన్ చేశాడు. ఇక ఈ సినిమాను త్వరగా ముగించేసి, పవన్ తన నెక్ట్స్ చిత్రం OGలో జాయిన్ కావాలని చూస్తున్నాడట. అయితే, ఈ క్రమంలోనే దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో వస్తోన్న హరిహర వీరమల్లు సినిమాపై కూడా పవన్ ఫోకస్ పెట్టాడట.
Pawan Kalyan : వైసీపీ పాలన అంతమే బీజేపీ, జనసేన లక్ష్యం-పవన్ కల్యాణ్
వీరమల్లు సినిమాను కూడా వీలైనంత త్వరగా ముగించేయాలని పవన్ భావిస్తున్నాడట. దీనికోసం తన డేట్స్‌ను కూడా అడ్జస్ట్ చేసుకుని రెండు సినిమాలను ఒకేసారి ముగించేయాలని పవన్ చూస్తున్నాడు. మరి నిజంగానే ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీతో పాటు హరిహర వీరమల్లు సినిమాను కూడా పవన్ ఒకేసారి ముగించేస్తాడా.. లేక వీరమల్లును ముందుగా ముగించేసి ఆ తరువాత ఉస్తాద్ మూవీని ముగిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.