Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ అవ్వనుంది. OG సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవ్వనుంది. ఇక మిగిలింది ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ ని తీసుకున్నారట. పవన్ కళ్యాణ్ పక్కన రాశీఖన్నాని ఈ సినిమాలో మరో హీరోయిన్ గా తీసుకున్నారట. ఆల్రెడీ రాశీఖన్నా సినిమా షూటింగ్ లో జాయిన్ అయిందని సమాచారం.
Also Read : Amitabh Bachchan : వామ్మో.. ఒక్కో ఎపిసోడ్ కి అమితాబ్ ఎన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?
ఒకప్పుడు వరుసగా తెలుగులో సినిమాలు చేసిన రాశీఖన్నా ఇప్పుడు ఎక్కువగా హిందీలో, తమిళ్ లో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం రాశిఖన్నా తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ పక్కన తెలుసు కదా సినిమా చేస్తుంది. ఇపుడు ఏకంగా పవర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. పవన్ పక్కన మొదటిసారి కనిపించబోతున్న రాశీఖన్నా ఉస్తాద్ భగత్ సింగ్ తో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.