Amitabh Bachchan : వామ్మో.. ఒక్కో ఎపిసోడ్ కి అమితాబ్ ఎన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?

ఈ షోలో ఒక్కో ఎపిసోడ్ కి అమితాబ్ తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చగా మారింది.

Amitabh Bachchan : వామ్మో.. ఒక్కో ఎపిసోడ్ కి అమితాబ్ ఎన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?

Amitabh Bachchan

Updated On : July 20, 2025 / 3:02 PM IST

Amitabh Bachchan : బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటాడని తెలిసిందే. కానీ టీవీ షోలకు కూడా ఒక్కో ఎపిసోడ్ కి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం అమితాబ్ సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అవ్వడం, అప్పుల్లో మునగడం.. అలాంటి సమయంలో అమితాబ్ ని మళ్ళీ నిలబెట్టింది కౌన్ బనేగా కరోడ్ పతి టీవీ షో.

కౌన్ బనేగా కరోడ్ పతి షోతో అమితాబ్ మళ్ళీ ప్రేక్షకులకు దగ్గరవడమే కాక ఫైనాన్షియల్ గా కూడా సెటిల్ అయ్యాడు. దీంతో ఆ షోని ప్రతి సీజన్ అమితాబ్ హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు 16 సీజన్లు పూర్తి చేసుకోగా త్వరలో 17వ సీజన్ రానుంది. హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి 17వ సీజన్ ఆగస్టు 11 నుంచి మొదలు కానుంది. ఈ మేరకు ఈ షోలో ఒక్కో ఎపిసోడ్ కి అమితాబ్ తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చగా మారింది.

Also Read : Prerana : మా ఆయన బిగ్ బాస్ కి వెళ్లొద్దు అన్నాడు.. పెళ్లయిన 8 నెలలకే..

అమితాబ్ బచ్చన్ ఈసారి కౌన్ బనేగా కరోడ్ పతి షోలో ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. వారానికి 5 ఎపిసోడ్స్ కాగా వారానికి 25 కోట్లు ఈ షో నుంచి అమితాబ్ సంపాదించనున్నారు. దీంతో యాంకర్ గా చేసినందుకు ఒక్కో ఎపిసోడ్ కి ఇన్ని కోట్లా.. అది అమితాబ్ రేంజ్ అని అంటున్నారు ఫ్యాన్స్, ప్రేక్షకులు.