Prerana : మా ఆయన బిగ్ బాస్ కి వెళ్లొద్దు అన్నాడు.. పెళ్లయిన 8 నెలలకే..
తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త మొదట బిగ్ బాస్ కి వద్దన్నాడు అని చెప్తూ ఆసక్తికర విషయం బయట పెట్టింది.

Prerana
Prerana : బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొని సీరియల్ నటి ప్రేరణ మంచి ఫేమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ప్రేరణ బిగ్ బాస్ లోకి వెళ్లేముందే పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త మొదట బిగ్ బాస్ కి వద్దన్నాడు అని చెప్తూ ఆసక్తికర విషయం బయట పెట్టింది.
ప్రేరణ మాట్లాడుతూ.. నాకు పెళ్లయిన 8 నెలలకే బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. ఒకవేళ చివరి వరకు ఆడినా మూడు నాలుగు నెలలు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని మా ఆయన బాధ పడ్డారు. బిగ్ బాస్ కి వెళ్లొద్దు అన్నారు. పెళ్లయ్యాక మొదటిసారి వచ్చే మా బర్త్ డేలు, మా పెళ్లి డే, ఫస్ట్ పండగలు అన్ని వదిలేసుకోవాలి అని బాధపడ్డారు.
కానీ ఇప్పుడు వచ్చింది చేసేద్దాం అని నేను అనుకున్నా. ఇప్పుడు ఛాన్స్ వదిలేస్తే మళ్ళీ వస్తుందో రాదో అని నా భయం. నేను బిగ్ బాస్ కి వెళ్ళాలి అని, వద్దని మా ఆయన గొడవ పడ్డాం. మూడు నాలుగు రోజులు నాతో ఆయన మాట్లాడలేదు కూడా.
Also Read : Prerana Kambam : సీరియల్ లో హీరోకి ముద్దు పెట్టానని బ్రేకప్ చెప్పాడు.. బిగ్ బాస్ భామ ప్రేరణ కామెంట్స్..
నేనేమో ఒప్పేసుకున్నా ఆల్రెడీ. వద్దంటే ప్రొఫెషనల్ గా పేరు పోతుంది. చాలా స్ట్రాంగ్ గా వెళ్లాల్సిన సమయంలో ఆయన వద్దు అని మాట్లాడటం మానేయడంతో నేను కూడా బాధపడ్డా. కానీ బిగ్ బాస్ కి వెళ్లే ఒక రెండు రోజుల ముందు నైట్ కూర్చొని ఆయనతో మాట్లాడి ఒప్పించా. ఆ తెల్లారి నుంచి నాతో మళ్ళీ మాములుగా మాట్లాడారు. నేను బిగ్ బాస్ లోపలికి వెళ్లి బయటకు వచ్చేంతవరకు ఆయనే బయట ఉండి సపోర్ట్ చేసారు అని తెలిపింది.