Pawan kalyan ustaad bhagat singh movie releasing in april
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉందని టాక్. గబ్బర్ సింగ్ లాంటి కాంబోలో చాలా కాలం గ్యాప్ తరువాత సినిమా వస్తుండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి.
అలాగే, ఈమద్యే పవన్ కళ్యాణ్ హిట్ ట్రాక్ లో వచ్చాడు. ఆయన హీరోగా వచ్చిన ఓజీ సినిమా ఎంత భారీ విజయాన్ని సాధించింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాంటి సినిమా తరువాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన ప్రతీ ఎలిమింట్ ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పించింది.
Raja Saab Collection: ప్యూర్ ప్రభాస్ స్టామినా.. రూ.200 కోట్ల మార్క్ దాటేసిన రాజాసాబ్
ఇటీవల విడుదలైన దేఖ్ లేంగే సాలా అనే సాంగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాను షేక్ చేసింది ఈ పాట. ఈ పాటలో పవన్ లుక్స్, ఆయన వేసిన మాస్ స్టెప్స్ సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో పెంచేశాయి. దీంతో, ఓజీ రేంజ్ లో ఈ సినిమా కూడా భారీ హిట్ అవడం ఖాయం అంటూ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అయితే, ఈ సినిమా విషయంలో ఇద్దరి ప్లాప్ సెంటిమెంట్ ఫ్యాన్స్ ని చాలా భయపెడుతోంది. ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ శ్రీలీల.
గబ్బర్ సింగ్ తరువాత దర్శకుడు హరీష్ శంకర్ కి చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. రీసెంట్ గా వచ్చిన మిస్టర్ బచ్చన్ కూడా భారీ ప్లాప్ గా నిలిచింది. ఇక హీరోయిన్ శ్రీలీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే, ధమాకా తరువాత ఆమె అరడజనుకు పైగా సినిమాలు చేసింది. వాటిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు. రీసెంట్ గా వచ్చిన తమిళ సినిమా పరాశక్తి కూడా డిజాస్టర్ అయ్యింది. ఇలా ఈ ఇద్దరూ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ప్లాప్ సెంటిమెంట్ గా మారారు. దీంతో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాస్త టెన్షన్ పడుతున్నారు. చూడాలి మరి విడుదల తరువాత ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందా అని.