Raja Saab Collection: ప్యూర్ ప్రభాస్ స్టామినా.. రూ.200 కోట్ల మార్క్ దాటేసిన రాజాసాబ్
కేవలం నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ప్రభాస్ ది రాజసాబ్(Raja Saab Collection) మూవీ.
Prabhas Raja Saab movie collected 200 crore in just 4 days
- రాజసాబ్ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్
- ప్రభాస్ స్టామినాతో నాలుగు రోజుల్లోనే రూ.201 కోట్లు
- మిక్సుడ్ టాక్ తో భారీ కలెక్షన్స్
Raja Saab Collection: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. కామెడీ అండ్ హారర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు మారుతీ తెరకెక్కించాడు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ డాట్ కీ రోల్ చేశాడు. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 9న రాజాసాబ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కానీ, ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది రాజాసాబ్(Raja Saab Collection). కథ, కథనాలు రొటీన్ గా ఉండటంతో ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు నెగిటీవ్ టాక్ వచ్చింది. అయినా కూడా కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్ లో రాబడుతోంది రాజాసాబ్. మొదటి రోజు ఏకంగా రూ.112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈసినిమా రెండు రోజుల్లోనే రూ.150 కోట్ల వసూళ్లు రాబట్టింది.
Panja Vaishnav Tej: మెగా హీరో వైష్ణవ్ తేజ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు
ఇక నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.201 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ కలెక్షన్స్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి. నిజానికి ప్రభాస్ రేంజ్ కి ఈ కలెక్షన్స్ చాలా అంటే చాలా తక్కువ. కానీ. మొదటిరోజు నుంచే మిక్సుడ్ టాక్ తెచ్చుకున్న ఒక సినిమా ఆ తరువాత కూడా స్టడీగా కలెక్షన్స్ రాబట్టడం మాములు విషయం కాదు. పోటీలో చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ కూడా ఉంది. వాటిని దాటుకొని ఆడియన్స్ నుంచి మంచి వసూళ్లను రాబడుతోంది ఈ మూవీ.
అయితే, సంక్రాంతి పండుగ సీజన్ రాజాసాబ్ సినిమాకు బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి. ఇప్పటికి రెండే సినిమాలు విడుదల అయ్యాయి కాబట్టి, ఈ మాత్రం కలెక్షన్స్ రావడం సహజమే. కానీ, మంగళవారం నుంచి ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది చూడాలి. మరి ఫైనల్ గా రాజాసాబ్ సినిమాకు ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయా అనేది చూడాలి.

Prabhas Raja Saab movie collected 200 crore in just 4 days
