Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Shelved or Postponed
Ustaad Bhagat Singh Movie : ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హరీశ్ శంకర్(Harish Shankar) కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడో మూడేళ్ల క్రితం అనౌన్స్ అయినా కొన్ని రోజుల క్రితమే సెట్స్ మీదకెళ్లింది. ఎక్కువ రోజులు షూట్ కూడా జరగలేదు. కేవలం రెండు షెడ్యూల్స్ షూట్ జరిగింది. మహా అయితే ఓ పది శాతం షూటింగ్ అయి ఉంటుంది.
వచ్చే సంవత్సరమే ఏపీలో ఎలక్షన్స్ ఉండటంతో పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రలతో బిజీగా ఉన్నారు. దీంతో పవన్ సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. పవన్ చేతిలో ప్రస్తుతం మూడు నడుస్తున్న సినిమాలు ఉన్నాయి. OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు. OG కి ఇంకో 20 రోజులు పవన్ డేట్స్ ఇస్తే షూటింగ్ అయిపోతుంది కాబట్టి ఎలాగైనా ఈ సినిమాకి డేట్స్ ఇస్తారు. కానీ ఉస్తాద్ అసలు షూటింగ్ పూర్తిగా మొదలవ్వలేదు. ఈ సినిమాకి చాలా డేట్స్ ఇవ్వాలి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్ని డేట్స్ పవన్ కళ్యాణ్ ఇవ్వడం చాలా కష్టం.
దీంతో ఉస్తాద్ సినిమా కూడా వాయిదా పడటం లేదా, ఆగిపోవడం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పట్లో కనీసం నెల రోజులు పవన్ సినిమాలకు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఒకవేళ ఏపీలోఎలక్షన్స్ అయ్యాక అప్పటి పరిస్థితిని బట్టి ఈ సినిమా ఉండొచ్చు లేదా సినిమా పూర్తిగా ఆగిపోవచ్చు అనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే మూడేళ్ళుగా వేరే ఏ సినిమా చేయకుండా హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం చూస్తూ కూర్చున్నారు. ఇది ఇప్పట్లో అయ్యేలా లేదని క్లారిటీ రావడంతో హరీశ్ కూడా కొన్నాళ్ళు ఈ ప్రాజెక్ట్ పక్కన పేటి వేరే సినిమా చేయబోతున్నాడని సమాచారం. మరి అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంటుందో లేదో చూడాలి.
ఇక హరిహర వీరమల్లు సినిమా అయితే ఇప్పట్లో లేదు ఎలక్షన్స్ తర్వాతే ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి కూడా చాలా షూటింగ్ పెండింగ్ ఉందని, ఇంకా పవన్ వి కనీసం నెల రోజులు అయినా డేట్స్ కావాలని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఉస్తాద్ కంటే ముందే మొదలుపెట్టినా ఇంకా సాగుతూనే ఉంది.