Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ ని పెట్టి పవన్ కళ్యాణ్ అని మోసం చేస్తారా? ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ పై అభిమానులు ఫైర్..

తాజాగా బుధవారం నాడు ఈ సినిమా షూట్ మొదలైందని హరీష్ శంకర్ ప్రకటించారు. పోలీస్ స్టేషన్ సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ మొదలైందని సమాచారం. అయితే సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది.

Pawan Kalyan Ustaad Bhagat Singh poster (Photo : Twitter)

Ustaad Bhagat Singh :  పవన్ కళ్యాణ్(Pavan Kalyan) వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎలక్షన్స్(Elections) టైంలోపు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నారు. అందుకే వరుసగా సినిమాలకు డేట్స్ ఇస్తున్నారు. ఇన్నాళ్లు ఆలస్యం అయిన సినిమాలకు వరుసగా డేట్స్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇటీవలే కేవలం 25 రోజుల్లో వినోదయసిత్తం(Vinodaya Sitham) రీమేక్ షూటింగ్ పూర్తి చేసేసారు పవన్. ఇప్పుడు హరీష్ శంకర్(Harish Shankar) ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh), సుజిత్(Sujith) OG సినిమాలకు డేట్స్ ఇచ్చారు.

రెండేళ్ల క్రితం హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సూపర్ హిట్ సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ తో పవన్ సినిమా అనౌన్స్ చేయడంతో అభిమానులంతా సంతోషం వ్యక్తం చేసి ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. కానీ పవన్ రాజకీయాల బిజీ వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

ఈ సినిమాకు ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ అనౌన్స్ చేసి ఇటీవల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా బుధవారం నాడు ఈ సినిమా షూట్ మొదలైందని హరీష్ శంకర్ ప్రకటించారు. పోలీస్ స్టేషన్ సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ మొదలైందని సమాచారం. అయితే సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఓ చైర్ లో కూర్చొని పోలీస్ గెటప్ లో ఓ చేతిలో రివాల్వర్, ఓ చేతిలో చై గ్లాస్ పట్టుకొని ఉన్నాడు. వెనుక నుంచి తీసిన ఫోటోని పోస్టర్ తో రిలీజ్ చేశారు.

Dasara Movie : 100 కోట్ల దసరా.. నాని కెరీర్ లో సూపర్ సక్సెస్ సినిమా..

అయితే ఈ పోస్టర్ వైరల్ అవ్వగా ఈ ఫొటోలో ఉన్నది హరీష్ శంకర్ అని, హరీష్ శంకర్ ఫోటో పెట్టి ఫ్యాన్స్ ని మోసం చేయాలనుకుంటున్నారా అంటూ హరీష్ ని, మైత్రి నిర్మాణ సంస్థని ట్రోల్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. ఈ పోస్టర్ చూస్తుంటే అచ్చం హరీష్ శంకర్ ని వెనుక నుంచి చూసినట్టే ఉంది. దీంతో అందరూ విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం పవన్ ని కొత్త లుక్ లోకి మార్చారా అని కామెంట్స్ చేస్తున్నారు.