Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయబోయే ఆ సినిమా ఆగిపోయిందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పాటు పవన్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా వరుసగా లైన్‌లో పెడుతున్నాడు. యాక్టర్ కమ్ డైరెక్టర్ సముధ్రఖని తెరకెక్కించిన తమిళ చిత్రం ‘వినోధయ సీతం’ను తెలుగులో పవన్ రీమేక్ చేయనున్నాడని వార్తలు జోరుగా వినిపించాయి.

Pawan Kalyan Vinodhaya Sitham Remake On Hold

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ పీరియాడికల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో పవన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి.

Pawan Kalyan: “వీరమల్లు”ను ముగించే పనిలో పవన్.. ఖుషీలో ఉన్న ఫాన్స్!

కాగా, ఈ సినిమాతో పాటు పవన్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా వరుసగా లైన్‌లో పెడుతున్నాడు. ఈ క్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘భవదీయుడు భగత్‌సింగ్’ను ఇప్పటికే అనౌన్స్ చేశాడు పవన్. ఈ సినిమాతో పాటు మరో రీమేక్ చిత్రాన్ని కూడా పవన్ లైన్‌లో పెడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు జోరుగా వినిపించాయి. యాక్టర్ కమ్ డైరెక్టర్ సముధ్రఖని తెరకెక్కించిన తమిళ చిత్రం ‘వినోధయ సీతం’ను తెలుగులో పవన్ రీమేక్ చేయనున్నాడని వార్తలు జోరుగా వినిపించాయి. ఈ సినిమా కోసం కసరత్తులు కూడా మొదలైనట్లుగా వార్తలు వినిపించాయి.

Pawan Kalyan: కిరణ్ అబ్బవరం సినిమా “నేను మీకు బాగా కావాల్సినవాడిని” ట్రైలర్‌ని విడుదల చేసిన పవన్ కళ్యాణ్..

అయితే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయినట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కేవలం హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేయాలని చూస్తున్నాడని.. ఈ సినిమా తరువాత పవన్ రాజకీయాలపై మళ్లీ ఫోకస్ పెట్టనుండటంతో ‘వినోధయ సీతం’ సినిమా రీమేక్ ఇప్పట్లో తెరకెక్కడం డౌటే అంటున్నారు ఈ వార్త తెలిసినవారు. అయితే ఈ సినిమా ఆగిపోలేదని, కేవలం హోల్డ్‌లో మాత్రమే ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను ఖచ్చితంగా పవన్ రీమేక్ చేస్తాడని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎలాంటి నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.