Pawan Kalyan
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఖాళీ సమయమే దొరకట్లేదు. అయినా కుదుర్చుకొని వీలు ఉన్నప్పుడల్లా సినిమాలకు డేట్స్ ఇచ్చారు. ఇన్నాళ్లు ఆయన చేతిలో ఉన్న సినిమాలను ఇటీవలే పూర్తిచేశారు. డైరెక్టర్స్ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని షూటింగ్స్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నారు.(Pawan Kalyan)
పవన్ కళ్యాణ్ టైం ఇవ్వడమే గగనం. అయినా ఇలాంటి సమయంలో స్టార్ సినిమాటోగ్రాఫర్ పవన్ ని వెయిట్ చేయించారట. ఇంతకీ అది ఏ సినిమాకు, ఆ సినిమాటోగ్రాఫర్ ఎవరో అనుకుంటున్నారా. పవన్ కళ్యాణ్ ని వెయిట్ చేయించిన సినిమాటోగ్రాఫర్ రవి చంద్రన్. OG సినిమాకు ఇలా చేశారట. ఇండియాలో టాప్ సినిమాటోగ్రాఫర్స్ లో రవి చంద్రన్ ఒకరు. తమిళ్, మలయాళం, బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు పనిచేసారు. తెలుగులో భరత్ అనే నేను, భీమ్లా నాయక్, OG సినిమాలకు పనిచేసారు.
Also Read : Samantha : హమ్మయ్య ఎట్టకేలకు సమంత మొదలుపెడుతుంది.. చాన్నాళ్ల తర్వాత..
OG సినిమాలో సినిమాటోగ్రఫీ విజువల్స్ ఎంత అందంగా ఉన్నాయో, పవన్ ఎంత స్టైలిష్ గా కనిపించారో అందరికి తెలిసిందే. అందరూ సినిమాటోగ్రాఫర్ వర్క్ ని మెచ్చుకున్నారు. రవి చంద్రన్ కూడా OG వర్క్ గురించి, ఆయనకు వచ్చిన అభినందనలు గురించి పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు. తాజాగా రవిచంద్రన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపాడు.
రవిచంద్రన్ మాట్లాడుతూ.. నా కెమెరా విజువల్స్ లో నటీనటులు ఆత్మ విశ్వాసంతో కనిపించాలని అనుకుంటాను. అందుకు పర్ఫెక్ట్ అవుట్ పుట్ తీసుకురావడానికి బాగా ట్రై చేస్తాను. పవన్ కళ్యాణ్ గారికి సాంకేతిక విషయాలపై కూడా పూర్తిగా అవగాహన ఉంది. సాంకేతిక నిపుణులకు ఆయన మంచి సహకారం ఇస్తారు. OG సినిమాలో ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఓ సీన్ షూటింగ్ చేస్తున్నప్పుడు లైటింగ్ నాకు అంతగా నచ్చలేదు. అసలు పవన్ కళ్యాణ్ గారి టైం దొరకడమే పెద్ద విషయం. అయినా సరే ఆ లైటింగ్ లో నేను సంతృప్తి పడక పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం చెప్పాను. నాకు కొంచెం టైం ఇస్తే మంచి లైటింగ్ సెట్ చేస్తాను, మీరు కొంచెం సేపు వెయిట్ చేయాలి అంటే ఏ మాత్రం విసుగు లేకుండా టైం గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయి నేను లైటింగ్ అంతా సెట్ చేసాక వచ్చారు. వచ్చాక నేను సెట్ చేసిన లైటింగ్ బాగుందని మెచ్చుకున్నారు అంటూ తెలిపారు.
Also Read : Ravi K Chandran : ఓజీ రిలీజ్ తర్వాత అకిరా నందన్ నాకు ఫోన్ చేసి.. ఓజీ సినిమాటోగ్రాఫర్ కామెంట్స్ వైరల్..
దీంతో రవిచంద్రన్ కామెంట్స్ వైరల్ గా మారాయి. బెస్ట్ అవుట్ పుట్ కోసం పవర్ స్టార్ ని వెయిట్ చేయించాను అని రవిచంద్రన్ చెప్పడాన్ని, సినిమా కోసం పవన్ కూడా అర్ధం చేసుకొని వెయిట్ చేయడాన్ని ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.