Hari Hara Veera Mallu : ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ ట్రైల‌ర్ చూసిన ప‌వ‌న్.. ప‌క్క‌నే త్రివిక్ర‌మ్ కూడా..

ప‌వర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్‌ న‌టిస్తున్న చిత్రం ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’.

PAWAN KALYAN WATCHES TRAILER OF HARI HARA VEERA MALLU

ప‌వర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్‌ న‌టిస్తున్న చిత్రం ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’. క్రిష్‌, జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. పీరియాడిక్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూలై 24న‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

అందులో భాగంగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను జూలై 3న ఉద‌యం 11.10 గంట‌లకు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. కాగా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ట్రైల‌ర్‌ను చూసి ఎంజాయ్ చేసిన‌ట్లు చిత్ర బృందం ఓ వీడియోను అభిమానుల‌తో పంచుకుంది. ప‌వ‌న్‌తో పాటు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కూడా ఈ ట్రైల‌ర్‌ను వీక్షించారు. ట్రైల‌ర్‌ను వీక్షించిన అనంత‌రం ద‌ర్శ‌కుడు జ్యోతికృష్ణ‌ను ప‌వ‌న్ అభినందించారు.

Dil Raju : పెద్ద సాహసమే చేస్తున్న దిల్‌రాజు.. త‌మ్ముడు మూవీ విష‌యంలో..


ఈ చిత్రంలోని కొంత భాగాన్ని క్రిష్ తెర‌కెక్కించారు. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న త‌ప్పుకోగా నిర్మాత ర‌త్నం కుమారుడు జ్యోతి కృష్ణ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా బాబీ డియోల్‌, అనుప‌మ్ ఖేర్‌, స‌త్య‌రాజ్ లు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. తొలి భాగం ‘హరి హర వీరమల్లు: పార్ట్‌ 1- స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో జూలై 24న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.