Dil Raju : పెద్ద సాహసమే చేస్తున్న దిల్‌రాజు.. త‌మ్ముడు మూవీ విష‌యంలో..

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు పెద్ద సాహసమే చేస్తున్నారు.

Dil Raju : పెద్ద సాహసమే చేస్తున్న దిల్‌రాజు.. త‌మ్ముడు మూవీ విష‌యంలో..

Dil Raju big decision on Nithiin Thammudu movie

Updated On : July 2, 2025 / 9:41 AM IST

సినిమా రిలీజ్‌కు ముందు పెయిడ్ ప్రీమియ‌ర్ వేయాలంటే గట్స్ ఉండాలనే చెప్పొచ్చు. తమ మూవీపై ఎంతో న‌మ్మకం ఉంటే త‌ప్ప పెయిడ్ ప్రీమియ‌ర్స్‌ వేసే సాహ‌సం చేయ‌రు. ప‌క్కాగా కొడ‌తాం.? అనే న‌మ్మకం మేక‌ర్స్‌లో ఉంటేనే పెయిడ్ ప్రీమియ‌ర్ జోలికి వెళ్లాలి. లేకపోతే అసలుకే ఎసరు వస్తోంది. పెయిడ్ ప్రీమియ‌ర్స్‌తో ముంద‌స్తు పాజిటివ్ టాక్ వస్తే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో.? సినిమా పోయిందనే టాక్ వ‌స్తే కూడా ప‌రిస్థితి అంతే దారుణంగా ఉంటుంది.

అందుకే కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో పెద్దగా ఎవరూ పెయిడ్ ప్రీమియర్స్‌ జోలికి వెళ్లడం లేదు. సరిగ్గా ఇదే టైమ్‌లో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు పెద్ద సాహసమే చేస్తున్నారు. నితిన్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన తమ్ముడు సినిమాకు జులై 3న పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని నిర్ణయించారు.

ఈ సినిమా జూలై 4న గ్రాండ్‌గా విడుదల కానుంది. సిస్టర్ సెంటిమెంట్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ మూవీపై దిల్ రాజు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ఆదరణను అంచనా వేయాలని, సినిమా విజయవంతమైతే మళ్లీ టాలీవుడ్‌లో ఈ ట్రెండ్‌ను రీస్టార్ట్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు.

కొన్నిరోజులుగా టాలీవుడ్‌లో పెయిడ్ ప్రీమియర్స్ ట్రెండ్ తగ్గుముఖం పట్టింది. భారీ బడ్జెట్ సినిమాలు కొన్ని నిరాశపరిచిన నేపథ్యంలో, నిర్మాతలు ఈ వ్యూహాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టారు. దిల్‌రాజు మాత్రం తమ్ముడు సినిమాతో ఈ ట్రెండ్‌ను తిరిగి తెరపైకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. తమ్ముడు మూవీ సక్సెస్ అయితే..దిల్‌రాజు బాటలో టాలీవుడ్ మళ్లీ పెయిడ్ ప్రీమియర్స్ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాలో నితిన్ ఆర్చరీ ప్లేయర్‌గా కనిపించనుండగా, లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫారెస్ట్ సెట్టింగ్‌లో రూపొందిన యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ కథాంశం సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. దిల్‌రాజు తీసుకున్న ఈ స్టెప్‌తో, టాలీవుడ్‌లో పెయిడ్ ప్రీమియర్స్ మళ్లీ ఊపందుకోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.