Pawan Kalyan : ఆ హీరోయిన్ ని రాజకీయాల్లోకి రమ్మన్న పవన్ కళ్యాణ్.. ఏం చెప్పిందో తెలుసా?
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణని పంచుకున్నారు. (Pawan Kalyan)
- Saketh U
- Published On : March 16, 2026 / 03:08 PM IST
Pawan Kalyan
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ అభిమానుల కోసం మరో పక్క తనకు కుదిరినప్పుడల్లా డేట్స్ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. పవన్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19న ఉగాది నాడు రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్ గా నటించారు. ఈ ఇద్దరు హీరోయిన్స్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.
తాజాగా రాశీఖన్నా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణని పంచుకున్నారు.
రాశీఖన్నా మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో చాలా తక్కువగా మాట్లాడేవారు. మాట్లాడినా బుక్స్, సినిమాలు, పాలిటిక్స్ గురించే మాట్లాడేవాళ్ళు పవన్ సర్. ఒకసారి.. మీరు సినిమాల్లోకి రావాలని అనుకున్నారా? లేక నటనలోకి రాకముందు వేరే ఏమైనా అవ్వాలనుకున్నారా? అని ఆయన నన్ను అడిగారు. నేను ఐఏఎస్ అవ్వాలని అనుకున్నానని, కానీ అది కుదరక ఇలా సినిమాల్లోకి వచ్చానని పవన్ సర్ కి చెప్పాను. దాంతో ఆయన ఐఏఎస్ అవ్వడం కుదరకపోతే రాజకీయాల్లోకి రావచ్చు కదా, అలా అయినా ప్రజలకు సేవ చేయొచ్చు అని చెప్పారు. కానీ పాలిటిక్స్ నా వల్ల కాదు అని చెప్పినట్టు తెలిపింది.
Also Read : Tamil Nadu Politics : తమిళనాడులో ఎన్డీయే కూటమిలోకి టీవీకే..? క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్..
