Aadya : టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కూతురు.. రేణు దేశాయ్‌తో పాటు..

రేణు దేశాయ్ దాదాపు 20 ఏళ్ళ తర్వాత టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswararao) సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది.

Aadya : టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కూతురు.. రేణు దేశాయ్‌తో పాటు..

Pawan Kalyan's daughter Adya was spotted with Renu Desai at Tiger Nageswara Rao's pre-release event

Aadya :  పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai), పవన్ పిల్లలు ఆద్య, అకీరాలపై ఫోకస్ ఎక్కువగానే ఉంటుంది. పవన్ పిల్లలు సోషల్ మీడియాలో లేకపోయినా రేణు దేశాయ్ అప్పుడప్పుడు పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలతో వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా రేణు దేశాయ్ తో పాటు ఆమె కూతురు ఆద్య కూడా వైరల్ అవుతుంది.

రేణు దేశాయ్ దాదాపు 20 ఏళ్ళ తర్వాత టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswararao) సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20 పాన్ ఇండియా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రేణు దేశాయ్ తో పాటు కూతురు ఆద్య కూడా వచ్చి అందర్నీ అలరించింది.

Also Read : వైల్డ్ కార్డు ఎంట్రీ.. వచ్చిన మొదటివారమే వెళ్లిపోయిన కంటెస్టెంట్..

ఈవెంట్ లో ఆద్య కనపడటంతో పవన్ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఈవెంట్ కి వెళ్లేముందే రేణు దేశాయ్ ఇవాళ ఈవెంట్ కి నాతో పాటు ఆద్య కూడా వస్తుంది అని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో చాలా గ్యాప్ తర్వాత ఆద్య కనపడటంతో ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇక ఆద్య ప్రస్తుతం నైన్త్ క్లాస్ చదువుతున్నట్టు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)