Aditi Govitrikar : చాన్నాళ్లకు కనిపించిన పవన్ తమ్ముడు మూవీ హీరోయిన్..

'అదితి గోవిత్రికర్' తెలుగులో తమ్ముడు సినిమా చేసిన తర్వాత పలు తెలుగు సినిమాలు చేసింది. ఆ తర్వాత నుండి తెలుగు సినిమాలకి బ్రేక్ ఇచ్చి బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది.

Pawan Tammudu movie heroine Aditi Govitrikar in Tirumala

Aditi Govitrikar : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా వచ్చి ఇన్నేళ్లు అవుతున్నప్పటికీ దాని క్రేజ్ ఏ వేరు. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు టీవీల్లో వస్తే చిందేస్తుంటారు. ఇక పవన్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 1999లో వచ్చిన ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ‘అదితి గోవిత్రికర్’ అందరికీ గుర్తుండే ఉంటుంది.

Also Read : NTR : ఎన్టీఆర్ కోసం కుప్పం నుండి కాలినడక వచ్చిన ఫ్యాన్స్.. ఎన్టీఆర్ చూసి ఏం చేసాడంటే..

అయితే ఈ బ్యూటీ తెలుగులో తమ్ముడు సినిమా చేసిన తర్వాత పలు తెలుగు సినిమాలు చేసింది. ఆ తర్వాత నుండి తెలుగు సినిమాలకి బ్రేక్ ఇచ్చి బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది. సినిమాలే కాకుండా పలు వెబ్ సిరీస్ కూడా చేసింది. తాజాగా ఈ భామ తిరుపతిలో ప్రత్యక్షమైంది. తిరుమల శ్రీవారిని దర్శించుకొని బయటికి వస్తున్న సమయంలో కెమెరా కంట పడింది. అలా ఈమె తిరుపతిలో కనిపించిన ఈ వీడియో వైరల్ అవుతుంది.


ఇక ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ..మీ అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. 17 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరుపతి బాలాజీ స్వామి దగ్గరికి వచ్చాను. మీ అందరికీ తెలుసు నేను తెలుగులో తమ్ముడు సినిమా చేశాను. ఇకపై మరెన్నో తెలుగు సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నా. ఆ ఆశర్వాదం కోసమే ఇక్కడికొచ్చాను అంటూ ‘అదితి గోవిత్రికర్’ తెలిపింది.