NTR : ఎన్టీఆర్ కోసం కుప్పం నుండి కాలినడక వచ్చిన ఫ్యాన్స్.. ఎన్టీఆర్ చూసి ఏం చేసాడంటే..

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఏకంగా కాలినడకన వచ్చి ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఏకంగా కుప్పం నుండి హైదరాబాద్ లోని జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చారు.

NTR : ఎన్టీఆర్ కోసం కుప్పం నుండి కాలినడక వచ్చిన ఫ్యాన్స్.. ఎన్టీఆర్ చూసి ఏం చేసాడంటే..

Fans who came from Kuppam on foot for NTR video goes viral

Updated On : November 15, 2024 / 4:03 PM IST

NTR : తమ అభిమాన హీరోల కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు ఫ్యాన్స్. వాళ్ల హీరోని ఎవరన్నా ఏమన్నా అంటే వార్ వన్సైడ్ అన్నట్టుగానే గొడవకి దిగుతారు. అంతేకాదు ఆ హీరోల బర్త్ డేలకి అన్నదానాలు, రక్తదానాలు అని పెద్ద ఎత్తున ఆర్భాటాలు చేస్తుంటారు. ఇంకొందరైతే తమ అభిమాన హీరో సినిమా హిట్ అవ్వాలని అనేక మొక్కులు మొక్కుతారు. గుండ్లు చేయించుకుంటుంటారు.

Also Read : Virat Kohli-Anushka Sharma :పెళ్లయిన మొదటి 6 నెలల్లో.. 21 రోజులు మాత్రమే కలిసున్నాం..

అయితే తాజగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఏకంగా కాలినడకన వచ్చి ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఏకంగా కుప్పం నుండి హైదరాబాద్ లోని జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చారు. వచ్చేటప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తో జూనియర్ ఎన్టీఆర్ కలిసి దిగిన చిన్నప్పటి ఫోటోని కూడా ఒక పెద్ద ఫ్రేమ్ చేయించి తీసుకొచ్చారు. తన అభిమానులు అంత దూరం నుండి వచ్చారని తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే వాళ్ళని కలిశారు.


ఇక ఎన్టీఆర్ తన అభిమానులని ఇంట్లోకి పిలిచి.. ఎక్కడి నుండి వచ్చారు అని అడిగితే.. కుప్పం నుండి మీ కోసం నడుచుకుంటూ వచ్చాం అని చెప్తే, నవ్వుతు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఎందుకు అంత దూరం నుండి నడుచుకుంటూ వచ్చారంటే.. మీ మీద ప్రేమ సర్.. మీ ఫ్యాన్స్ అని చెప్తారు ఆ అభిమానులు. అనంతరం ఎన్టీఆర్ కాసేపు వారితో మాట్లాడి, ఫోటోలు దిగి పంపించేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది .