Payal Ghosh : బాలీవుడ్ నటులు బాలకృష్ణ సర్‌ని చూసి నేర్చుకోవాలి.. హీరోయిన్ ట్వీట్ వైరల్..

రెగ్యులర్ గా బాలీవుడ్(Bollywood) పై ఏదో ఒక సంచలన ట్వీట్ చేస్తూ, సౌత్ వాళ్ళని పొగుడుతూ వైరల్ అవుతూ ఉంటుంది పాయల్ ఘోష్. తాజాగా ఈసారి బాలయ్య బాబుపై ట్వీట్ వేసి వైరల్ అయింది పాయల్.

Payal Ghost Tweet on Balakrishna Goes Viral

Payal Ghosh : తెలుగులో ప్రయాణం, ఊసరవెల్లి లాంటి పలు సినిమాలతో మెప్పించిన పాయల్ ఘోష్ చివరగా 2017లో ఓ హిందీ సినిమాలో కనిపించింది. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. ఓ రాజకీయ పార్టీలో చేరి రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడానికి చూస్తుంది పాయల్ ఘోష్. అయితే పాయల్ తన కామెంట్స్, తన ట్వీట్స్ తో మాత్రం పలు వివాదాల్లో నిలుస్తుంటుంది.

రెగ్యులర్ గా బాలీవుడ్(Bollywood) పై ఏదో ఒక సంచలన ట్వీట్ చేస్తూ, సౌత్ వాళ్ళని పొగుడుతూ వైరల్ అవుతూ ఉంటుంది పాయల్ ఘోష్. తాజాగా ఈసారి బాలయ్య బాబుపై ట్వీట్ వేసి వైరల్ అయింది పాయల్. గతంలో బాలయ్యతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి.. బాలీవుడ్ నటులు బాలకృష్ణ(Balakrishna) సర్ ని చూసి నేర్చుకోవాలి. ఆయన ఈ ఏజ్ లో కూడా వరుస హిట్స్ ఇస్తున్నారు అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవ్వగా పలువురు బాలయ్య అభిమానులు సంతోషంతో కామెంట్స్ చేస్తుంటే, బాలీవుడ్ నెటిజన్లు మాత్రం విమర్శలు చేస్తున్నారు.

Also Read : Jabardasth Emmanuel : నేను చచ్చిపోయాను అని రాశారు చేతకాని కొడుకులు.. నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్..

ఇక పాయల్ ఘోష్ ఇప్పుడిప్పుడే మళ్ళీ వీడియో ఆల్బమ్స్, యూట్యూబ్ లలో, ఓటీటీలలో నటిస్తూ సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.