Jabardasth Emmanuel : నేను చచ్చిపోయాను అని రాశారు చేతకాని కొడుకులు.. నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్..

జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ఓ వెబ్ సిరీస్ లో ఇమ్మాన్యుయేల్ చనిపోయినట్టు నటించాడు. దీంతో ఆ ఫోటోలను తీసుకొని ఇమ్మాన్యుయేల్ మరణించాడని పలు యూట్యూబ్ చానళ్ళు ఫేక్ వీడియోలు పెట్టాయి.

Jabardasth Emmanuel : నేను చచ్చిపోయాను అని రాశారు చేతకాని కొడుకులు.. నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్..

Jabardasth Emmanuel Fires on Fake News about his Death

Jabardasth Emmanuel : ఇటీవల ఫేక్ వార్తలు(Fake News) బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా సెలబ్రిటీల మీద అయితే వారు చనిపోయారని వార్తలు రాస్తున్నారు. ఎవరికైనా ఆనారోగ్యంతో హాస్పిటల్ లో చేరినా, చనిపోయిన సన్నివేశాల్లో నటించినా ఆ నటులు మరణించారని పలు యూట్యూబ్ ఛానల్స్ థంబ్నైల్స్ పెట్టి మరీ ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నాయి. అలాగే తాజాగా జబర్దస్త్ కమెడియన్ ఇమ్మన్యుయెల్ మరణించాడని పలు యూట్యూబ్ ఛానల్స్ ప్రమోట్ చేశాయి.

జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ప్రేమ వాలంటీర్ అనే ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ సిరీస్ లో ఇమ్మాన్యుయేల్ చనిపోయినట్టు నటించాడు. దీంతో ఆ ఫోటోలను తీసుకొని ఇమ్మాన్యుయేల్ మరణించాడని పలు యూట్యూబ్ చానళ్ళు ఫేక్ వీడియోలు పెట్టాయి. దీంతో ఆ వీడియోలు వైరల్ అవ్వడంతో ఈ విషయం ఇమ్మాన్యుయేల్ వరకు చేరింది.

Also Read : Anasuya : ఆంటీ అంటే అనసూయకు ఎందుకు కోపం? ఇలాంటి వాళ్ళే రేపిస్ట్‌లు అవుతారు.. ఎమోషనల్ అయిన అనసూయ..

తాజాగా ఈ వీడియోలపై ఇమ్మాన్యుయేల్ స్పందిస్తూ ఓ వీడియో చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో.. చేతకాని కొడుకులు నేను చచ్చిపోయారని రాశారు. అది నటనరా. ప్రేమ వాలంటీర్ సిరీస్ లో నేను చచ్చిపోయినట్టు నటించానురా. నేను బతికే ఉన్నాను. ఇలా రాసేవాళ్ళని చేతకాని కొడుకులు అంటారు అని నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. దీంతో ఈ వీడియో వైరల్ గా మారగా అలాంటి ఫేక్ వీడియోలు చేసే వారిపై విమర్శలు చేస్తున్నారు పలువురు నెటిజన్లు.