Payal Radhakrishna : మా నాన్నతో కలిసి తాగుతాను.. హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్..
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాయల్ రాధాకృష్ణ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డ్రింకింగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. (Payal Radhakrishna)
Payal Radhakrishna
Payal Radhakrishna : ప్రసన్న వదనం, అలా నిన్ను చేరి, చౌర్య పాఠం, పాపం ప్రతాప్.. ఇలా పలు తెలుగు సినిమాలతో మెప్పించిన హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ. తెలుగులో వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగానే ఉంది పాయల్. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. త్వరలో పాయల్ హ్యాపీ జర్నీ అనే సినిమాతో రాబోతుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాయల్ రాధాకృష్ణ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డ్రింకింగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Also See : Riya Shibu : ‘సర్వం మాయ’ డెలులు క్యూట్ దయ్యం గుర్తుందా.. మలయాళీ భామ రియా శిబు ఓనం సెలబ్రేషన్స్..
పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. నేను సిగరెట్స్ తాగను. డ్రింక్ మాత్రం మా నాన్నతోనే ఇంట్లోనే తాగుతాను. మా నాన్నే నాకు ఫస్ట్ డ్రింక్ ఆఫర్ చేసారు. ఎప్పుడు తాగినా ఇంట్లోనే తాగుతాను. కానీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు దానిపై. మా నాన్న చాలా అద్భుతమైన వ్యక్తి. ఇప్పుడు ఫెమినిజం అని మాట్లాడుతున్నారు కానీ ఎప్పుడో మా నాన్న ఫెమినిస్ట్ గా ఉండి చాలా చేసారు. ఆయన బెస్ట్ పర్సన్ అని తెలిపింది.
