Payal Rajput another pan India movie
Payal Rajput another pan India movie : ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర వేసింది పాయల్ రాజ్‌పుత్. కుర్రాళ్లకు హాట్ ఫేవరెట్‌గా మారింది. ఆ తరువాత వరుస సినిమాల్లో నటించింది. అయితే.. ఆ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయాయి. ఎట్టకేలకు ‘మంగళవారం’ మూవీతో సూపర్ డూపర్ హిట్‌ను అందుకుంది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. తాజాగా అమ్మడు ఓ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతోంది.
ముని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఆయనే కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. టికెట్ ఎంటర్టైన్‌మెంట్స్, అర్జున్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ బ్యానర్లలో తొలి చిత్రంగా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రంలో పాయల్ పాత్ర చాలా ఎమోషన్‌గా ఉండబోతుందని చిత్ర బృందం చెబుతోంది.
ఈ చిత్ర షూటింగ్ జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని రానానాయుడు స్టూడియోస్‌లో ఈ చిత్ర ప్రారంబోత్సవం జరగనుంది. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్ర ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. ఆ రోజు ఈ చిత్రంలో ఎవరెవరు నటించనున్నారు అనే విషయాలను వెల్లడించనున్నారు.