Maya Petika : ఆహాలో ‘మాయా పేటిక’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

'ఆర్ఎక్స్ 100' చిత్రంతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్ రాజ్‌పుత్(Payal Rajput). ఆమె న‌టిస్తున్నసినిమా ‘మాయా పేటిక’(Maya Petika).

Maya Petika

Maya Petika : ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్ రాజ్‌పుత్(Payal Rajput). ఆమె న‌టిస్తున్నసినిమా ‘మాయా పేటిక’(Maya Petika). విరాజ్ అశ్విన్, సిమ్ర‌త్ కౌర్, ర‌జ‌త్ రాఘ‌వ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ర‌మేష్ రాప‌ర్తి దర్శకత్వంలో రొటీన్ కథాంశాలకు భిన్నంగా ఈ చిత్రం తెరకెక్కింది. సునీల్, పృథ్వీరాజ్‌, శ్రీనివాస్ రెడ్డి, హిమ‌జ‌, శ్యామ‌ల తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తుండగా మాగుంట శ‌ర‌త్ చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించారు.

Maya Petika

ఓ స్మార్ట్ ఫోన్ చుట్టూ తిరిగే క‌థ‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ ఫోన్‌లో ఉన్న అద్భుత‌మైన ఫీచర్లు చూసిన వారు ఎవరైనా సరే దానితో తెలియకుండానే ఓ అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. టాలీవుడ్ స్టార్ అయిన పాయల్ కు ఓ నిర్మాత ఆ ఫోన్ ను గిఫ్ట్ గా ఇస్తాడు. అయితే అనుకోని స‌మ‌స్య రావ‌టంతో ఆ ఫోన్‌ని ఆమె త‌న అసిస్టెంట్‌కు ఇస్తుంది. అక్క‌డి నుంచి స్మార్ట్ ఫోన్ ఒక్కొక్క‌రి చేతులు మారుతూ వివిధ ప్రాంతాల్లోని వ్య‌క్తుల చేతుల్లోకి వెలుతుంది. ఆ ఫోన్‌ను సొంతం చేసుకున్న ప్ర‌తీ వ్య‌క్తి ఓ అనిర్వ‌చ‌నీయ‌మైన అనుభూతికి లోన‌వుతాడు. అయితే ఈ ఫోన్ ఒక సాధ‌న‌మే క‌దా, మ‌రి ఇది మ‌న చేతుల్లో ఉండ‌టం అనేది వ‌ర‌మా? శాప‌మా? అనే ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తుతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా సెప్టెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది.