సీత.. ఐటెమ్ సాంగ్ లో RX 100 బ్యూటీ

RX 100 సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌ఫుత్ కు తొలి అడుగుతోనే ఆమెకి పెద్ద విజయం దక్కింది. ప్రస్తుతం వెంకీమామ చిత్రంలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. రవితేజ చిత్రంలోను ముఖ్య పాత్ర పోషించనుంది. అంతేకాదు తమిళంలోను పలు ప్రాజెక్టులు చేస్తుంది పాయల్. అయితే సీత సినిమా కోసం పాయల్ రాజ్‌పుత్ బుల్ బుల్ బుల్లెట్టు అంటూ ఐటమ్ సాంగ్‌తో రచ్చ చేస్తుంది. సీత చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానున్న నేపథ్యంలో పాయల్ మాస్ సాంగ్‌ని విడుదల చేశారు.
తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘సీత’. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. సోనూ సూద్, తనికెళ్ల భరణి, అభినవ్ గోమటం, అభిమన్యుసింగ్ నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
కొరియోగ్రాఫర్ సిర్షా రాయ్.. ఈ సాంగ్‌కి పాయల్‌తో ఊరమాస్ స్టెప్పులు వేయించింది. బుల్లెట్, యమహా, బజాజ్ ఇలా ఫేమస్ బైక్స్ పై పాయల్ అందచందాలను ఆస్వాదించడానికి పాయల్ అందుకున్న ఐటమ్ పాటపై మీరూ ఓ లుక్కేయండి. ఈ చిత్రం ప్రేక్షకులని తప్పక మెప్పిస్తుందని టీం చెబుతుంది.