×
Ad

Chikiri-Kissik: పెద్ది దెబ్బకు పుష్ప 2 అవుట్.. ‘చికిరి’ సాంగ్ సరికొత్త రికార్డ్స్.. వేట మొదలు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న (Chikiri-Kissik)ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Peddi Chikiri song brakes Pushpa 2 Kissik Song records

Chikiri-Kissik: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ (Chikiri-Kissik)శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 మర్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం తెలిసిందే. తాజాగా ‘చికిరి’ సాంగ్ విడుదల చేసింది పెద్ది టీం.

Vishal: మీ కాళ్లు మొక్కుతాను.. దయచేసి రాజకీయం చేయకండి.. వైఎస్ఆర్ కి నా సెల్యూట్..

ఏఆర్ రహమాన్ స్వరపరిచిన ఈ పాటను ‘మోహిత్ చౌహన్’ పాడారు. నవంబర్ 7న విడుదలైన ఈ పాటకు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. పక్కా రూరల్ బీట్ తో రహమాన్ అందించిన మ్యూజిక్ కి ఆడియన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే సాంగ్ వినిపిస్తోంది. ఆలాగే, పాటలో రామ్ చరణ్ వేసిన గ్రేస్ ఫుల్ స్టెప్స్, జాన్వీ అందాలు అయితే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. దీంతో, ఈ పాటను రిపీట్ మోడ్లో వినేస్తున్నారు ఆడియన్స్. అయితే, ఈ నేపధ్యంలోనే సరికొత్త రికార్స్డ్ క్రియేట్ చేస్తోంది చికిరి సాంగ్.

చికిరి సాంగ్ కేవలం 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్‌ సాధించింది. 24 గంటల్లోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. ఇండియన్‌ సినిమా చరిత్రలోనే ఒక్కరోజులో ఇన్ని వ్యూస్‌ సాధించిన తొలిసారి అవడం రికార్డ్ అనే చెప్పాలి. అంతకుముందు కేవలం 13 గంటల్లోనే 32 మిలియన్ల వ్యూస్‌ సాధించింది ఈ పాట. గతంలో 24 గంటల్లో 32 మిలియన్ల వ్యూస్‌ సాధించిన పుష్ప 2 లోని కిసిక్ సాంగ్ రికార్డులను ఈ పాట బద్దలుకొట్టింది. పెద్ది సినిమా నుంచి వచ్చిన మొదటిపాటకే ఈ రేంజ్ లో రేపన్స్ రావడం పట్ల పెద్ది మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మెగా ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీలవుతున్నారు.